Sara Ali Khan Weight loss Journey : సారా అలీ ఖాన్ బాలీవుడ్‌లో సైఫ్ అలీఖాన్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడంటే ఈ భామ సన్నగా, నాజుగ్గా ఉంది కానీ.. మొదట్లో సారాను చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సినిమాల్లోకి రావడం కోసం ఈ భామ ఏకంగా 49 కిలోల బరువు తగ్గింది. సారా సినిమాల్లోకి రాకముందు 96 కిలోలు ఉండేది. సినిమాల్లోకి రావడం కోసం ఆ బరువును 47 కిలోలకు తగ్గించుకుంది. ఎవరైనా 49 కిలోల బరువు తగ్గడం అంటే మామూలు విషయమా? ఎంతో డెడికేషన్ కావాలి. సారా కూడా తన బరువు తగ్గించుకోవడం కోసం అంతే కష్టపడింది. తన బరువు గురించి మాట్లాడటానికి సారా ఎప్పుడూ వెనకాడదు. పైగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపింది ఈ భామ.
సారా అలీ ఖాన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను అధిక బరువుతో ఇబ్బంది పడేదానిని. పైగా పీసీఓడీ సమస్య నాలో ఇన్సెక్యూరిటీని మరింత పెంచేసింది. నేను దానిని ఓవర్కామ్ చేయాలనుకున్నాను. దానిలో భాగంగానే బరువు తగ్గేందుకు ప్రయత్నించింది ఈ భామ. "
బరువును ఎలా తగ్గిందంటే..
బరువు అనేది కేవలం శరీరంపైనే కాకుండా.. మనస్సుపై కూడా ప్రభావం చూపుతుందని సారా తెలిపింది. అందుకే ఫుడ్ విషయంలో, వర్క్ అవుట్ విషయంలో చాలా కఠినంగా ఉంటానని చెప్తుంది. బరువు తగ్గడంలో భాగంగా తన ఆహారపు అలవాట్లు చాలా మార్చుకున్నానని తెలిపింది. అలాగే సమతుల్య జీవనశైలిని అవలంబించనట్లు.. వీటి ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకుంటుంది. సారా తన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేసింది. దీని కారణంగానే ఆమె ఇలాంటి టోన్డ్ బాడీని పొందగలిగినట్లు తెలిపింది.
ఆహారంలో ఇవి చేర్చింది
బరువు తగ్గించుకోవడానికి సారా తన ఆహారంలో తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలను చేర్చింది. ఆమె రోజుకు ఒకసారి మాత్రమే కార్బోహైడ్రేట్లు తీసుకునేదట. దీనితో పాటు ఆమె ఆహారంలో పండ్లు, ధనియాల-జీలకర్ర నీరు, కూరగాయల స్మూతీలను తీసుకునేది. ఆహారంతో పాటు, సారా కార్డియో, వెయిట్ ట్రైనింగ్ కూడా చేసింది. బరువు తగ్గించుకోవడానికి ఆమె స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో పాటు ధ్యానం, పిలేట్స్ కూడా చేసిందట. ఈ విధంగా తన బరువును 96 కిలోల నుంచి 47 కిలోలకు తగ్గించుకుంది. విజయవంతంగా 49 కిలోల బరువును తగ్గించుకున్నట్లు తెలిపింది. ఇప్పటికీ తన జీవనశైలిని అలాగే బ్యాలెన్స్ చేస్తూ హీరోయిన్గా కెరీర్ ముందుకు తీసుకువెళ్తోంది.
బరువు తగ్గాలనుకుంటే డైట్, వ్యాయామం ఫాలో అవ్వడం మాత్రమే కాదు.. దానిని మీరు గివ్ అప్ చేయకుండా ఉన్నప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. కొద్ది రోజులు చేసి ఆపేయడం వల్ల మార్పు ఉన్నా.. అది ఎక్కువకాలం ఉండదని గుర్తించుకోవాలి. బరువులో మార్పులు గమనిస్తున్నప్పుడు కచ్చితంగా నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.