Student Murder in Rangareddy District | కొత్తూరు: అక్క ప్రియుడితో మాట్లాడుతుందని, ఇదివరకే కుటుంబంలో గొడవలు జరిగానా మార్పురాలేదని.. ఆమెతో గొడవ పడి సోదరుడు దారుణంగా హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం (జులై 28న) ఈ ఘటన చోటు చేసుకుంది. 

Continues below advertisement


అసలేం జరిగిందంటే..
కొత్తూరు మండలం పెంజర్లకు చెందిన దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు సంతానం ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. రాఘవేంద్ర మేస్త్రి పని, వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మీరు పెద్ద కుమార్తె రుచిత వయసు 21 సంవత్సరాలు. రుచిత ఇటీవల డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ కాలేజీలో ఎదురు చూస్తోంది. గత కొంతకాలం నుంచి రుచిత గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉంది. విషయం పెద్దలకు తెలియడంతో రుచిత ప్రేమ వ్యవహారంపై గొడవలు జరిగేవి. ఈ విషయం పంచాయతీ వరకు వెళ్లగా అబ్బాయి, అమ్మాయి ఇకపై మాట్లాడుకోమని, కలుసుకోమని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


కానీ కొన్ని రోజుల నుంచి రుచిత మళ్లీ తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోంది. విషయాన్ని గమనించిన సోదరుడు రోహిత్ అక్కను పలుమార్లు మందలించాడు. సోమవారం నాడు తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లగా అక్క, తమ్ముడు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అక్క రుచిత తన ప్రియుడుతో ఫోన్లో మాట్లాడుతుంటే సోదరుడు రోహిత్ గమనించాడు. పరువు పోతుందని ఎన్నిసార్లు మందలించినా ఎందుకిలా చేస్తున్నావ్ అంటూ రుచిత గొడవకు దిగాడు. 


ఆవేశంలో ఉన్న రోహిత్ తన సోదరి ఉచిత మెడకు ఓవైరు బిగించి ఊపిరాడకుండా చేశాడు. కాసేపటికే రుచిత చనిపోయింది. బంధువులకు రోహిత్ ఫోన్ చేసి అక్క ఊహ కోల్పోయింది అని చెప్పాడు. ఇంటికి వెళ్లి చూడగా రుచిత అప్పటికే చనిపోయింది. తర్వాత రుచిత తల్లిదండ్రులు సైతం ఇంటికి చేరుకొని కూతురి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు తో రుచిత హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.