Raghava Lawrence : డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ తన దాతృత్వ హృదయాన్ని చాటుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆయన 150మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. వారి విద్యకు కావల్సిన ఖర్చునంతా తానే భర్తిస్తానని హామీ ఇచ్చారు. దీంతో లారెన్స్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది మామూలు ప్రేక్షకులనే కాదు 'పుష్ప' హీరో అల్లు అర్జున్ ని సైతం ఆకట్టుకుంది. అందుకు సూచనగా ఆయన 'రెస్పెక్ట్' అని సంభోదిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
దర్శకుడిగా, నటుడిగా, డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇటీవలే కొంతమంది మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఆయన.. వారితో కలిసి నవ్వుతూ ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. 150మంది పిల్లలను దత్తత తీసుకుని, వారి విద్యకు కావల్సిన అన్ని ఏర్పాట్లను తానే చూసుకుంటానని తెలియజేశారు. ఈ విషయం పంచుకోవడం తనకు చాలా ఆనందాన్నిస్తుందన్నారు. మీ అందరి ఆశీస్సులు కావాలని సోషల్ మీడియా వేదికగా లారెన్స్ కోరారు.


లారెన్స్ ఇలా పిల్లలకు సహాయం చేసి మానవత్వాన్ని నిరూపించుకోవడం మొదటిసారేం కాదు. ఇంతకుముందు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా మంది చిన్నారులకు, యువకులకు సాయంగా నిలిచారు. 


లారెన్స్ లేటెస్ట్ గా నటించిన 'రుద్రన్' (తెలుగులో ‘రుద్రుడు’ పేరుతో) ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఈ ఘటన జరిగింది. తెలుగు మాట్లాడే పిల్లలెవరైనా స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటే లేదా గుండెకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తే వెంటనే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్‌ని సంప్రదించాలని ఆయన కోరడం అందర్నీ ఆకర్షించింది. ఆ సమయంలోనే పిల్లల దత్తత విషయంపై క్లారిటీ ఇచ్చారు. వారి చదువుకయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.


ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రాఘవ లారెన్స్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీరు ఎంత గొప్పవారనేది మాటల్లో చెప్పలేమని, ఈ రోజుల్లో మన వారే మనకు సహాయం చేయడం లేదని, అలాంటిది మీరు ఇతరులకు అండగా నిలుస్తున్నారు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోందని, మీరు అనుకున్నది సాధించాలంటూ మరికొందరు లారెన్స్ ను మెచ్చుకుంటున్నారు. 


 లారెన్స్ పోస్ట్ పై ఇలా మామూలు ప్రేక్షకులు, ఫ్యాన్సే కాదు సినీ ప్రముఖులు కూడా ప్రశంసిస్తూ కామెంట్ చేస్తు్న్నారు. తాజాగా స్టైలిష్ స్టా్ర్ అల్లు అర్జున్ కూడా ఓ ఇంట్రస్టింగ్ కామెంట్ చేసి వైరల్ గా మారారు. లారెన్స్ పోస్ట్ కింద అల్లు అర్జున్ 'రెస్పెక్ట్' అంటూ ఇంగ్లీషులో రాసుకొచ్చారు. దీంతో లారెన్స్ పోస్ట్ తో పాటు, అల్లు అర్జున్ కామెంట్ సైతం నెట్టింట్లో వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.


తమిళ స్టార్ హీరోస్ రజనీకాంత్, సూర్య తర్వాత నిర్మాత VA దురైకి ఆర్థిక సహాయం  అందించి రాఘవ మరోసారి వార్తల్లో నిలిచారు. నిర్మాతకు వైద్య ఖర్చుల కోసం గానూ రూ.3లక్షల విరాళంగా ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న VA దురైకి.. ఆలనాపాలనా చూసుకునే వారు సైతం ఎవరూ లేకపోవడంతో అతని స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారు. అతడి కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు కూడా చెబుతున్నారు. అతడి వైద్యం కోసం సాయం చేయాలంటూ నిర్మాత స్నేహితుడు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో లారెన్స్ స్పందించి ఆయన వంతు సాయం అందించారు.


ఇదిలా ఉండగా రాఘవ లారెన్స్  రాబోయే చిత్రం 'రుద్రన్' ఏప్రిల్ 14 న థియేటర్లలో విడుదలైంది.  ఒక పాత కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కతిరేశన్ దర్శకత్వం వహించగా, ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. కతిరేసన్ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.బి బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాతగానూ పని చేశారు.


Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?