Asalu: టాలీవుడ్ లో ఉన్న విలక్షణ దర్శకుల్లో రవిబాబు ఒకరు. దర్శకుడిగా ఆయన చేసిన సినిమాలు అన్నీ సరికొత్తగా ఉంటాయి. మరోవైపు నటుడుగానూ తన మార్క్ ను చూపిస్తున్నారు. కామెడీ డ్రామా, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఆయనకు ప్రత్యేక స్టైల్ ఉంటుంది. ‘అల్లరి’ వంటి కామెడీ సినిమాలు చేసిన రవిబాబు తర్వాత ‘అనసూయ’, ‘అవును’, ‘అమరావతి’ వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించారు. రవిబాబు మరో కొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘అసలు’ పేరుతో సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మూవీ ను ప్రమోషన్ చేసేందుకు మూవీ టీమ్ సరికొత్త ప్లాన్ చేసింది.
‘అసలు’ సినిమాలోని కథను మలుపుతిప్పే కీలక సన్నివేశాన్ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. అందులో మూవీలో మొదటి నాలుగు నిమిషాలను విడుదల చేసింది. ఈ సీన్ లో ఓ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ కు ఫోరెన్సిక్ స్టడీస్ కు సంబంధించిన ఆన్ లైన్ క్లాసులు చెప్తుంటారు. అతను క్లాసు చెప్తుండగా మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అతన్ని కత్తితో మెడపై అతిదారుణంగా పొడిచి చంపేసి వెళ్లిపోతాడు. ఇదంతా కంప్యూటర్ స్క్రీన్స్ పై స్టూడెంట్స్ అంతా చూసి భయపడిపోతారు. అయితే ఆ వ్యక్తిని చంపింది ఎవరు, ఎందుకు హత్య చేశాడు. అసలు సినిమా కథ ఏంటి అనేది మిగిలిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సాధారణంగా రవిబాబు ఇలాంటి సినిమాలు తీయడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం ఈ నాలుగు నిమిషాలు సన్నివేశాన్ని విడుదల చేయడంతో మూవీ పై ఆసక్తి పెరిగింది. సినిమా చూడని వారు ఎవరైనా ఇది చూస్తే కచ్చితంగా సినిమా చూడాలి అనే విధంగా ఆ సన్నివేశం ఉంది. సినిమా మొత్తానికి ఈ సన్నివేశమే కీలకం కాబట్టి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచే విధంగా ఆ సీన్ ను విడుదల చేశారు. మొత్తంగా ఈ సినిమాలో థ్రిల్లర్, క్రైమ్ అంశాలు బాగానే ఉన్నా అవి రవిబాబు మార్క్ ను చూపించలేదనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రవిబాబు ఆ హత్య కేసును చేధించే పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. మొదటి భాగం పర్వాలేదని పించినా సెకండ్ ఆఫ్ అంతగా ఆకట్టుకోలేదనే అంటున్నారు. మరి ఈ సీన్ లీక్ అంశం సినిమా వ్యూవర్షిప్ ను పెంచుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో రవిబాబు, పూర్ణ ల నటన ఆకట్టుకునేలా ఉంటుంది. మిగిలిన వారు కూడా పరిధిమేరకు కష్టపడ్డారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది. కథ, కథనంలో ఇంకాస్త కొత్తదనం ఉంటే బాగుండేదని అంటున్నారు పలువురు ప్రేక్షకులు. మరి ఈ సినిమా మరి కొన్ని రోజులకు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.