యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ప్రేమకథా చిత్రం 'రాధే శ్యామ్'. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 'బాహుబలి', 'సాహో' వంటి యాక్షన్ చిత్రాల తర్వాత ప్రభాస్ ప్రేమకథా చిత్రం చేయడం రిస్క్ అని చాలా మంది అభిప్రాయపడితే... ఆ రిస్క్ ప్రేక్షకులకు నచ్చింది. నిజం చెప్పాలంటే... 'రాధే శ్యామ్'కు గొప్ప రివ్యూలు రాలేదు. కానీ, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. తొలి మూడు రోజుల్లో... అంటే ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా రూ. 151 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్రబృందం నేడు ప్రకటించింది.


'రాధే శ్యామ్'కు తొలి రోజు రూ. 79 కోట్ల గ్రాస్ వచ్చింది. రెండో రోజు రూ. 40 కోట్ల గ్రాస్, మూడో రోజైన ఆదివారం రూ. 32 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తం మీద మూడు రోజుల్లో రూ. 151 కోట్లు కలెక్ట్ (గ్రాస్ వసూళ్లు) చేసింది. మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే... అందుకు ప్రభాస్ ఇమేజ్, స్టార్‌డ‌మ్ కార‌ణం అని చెప్పాలి. సినిమా విడుదలకు ముందే డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మేశారు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఆల్రెడీ నిర్మాతలు సేఫ్ అయ్యారని, సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని యూనిట్ వర్గాలు తెలిపాయి.


Also Read: ప్రభాస్‌తో మారుతి మసాలా ఎంట‌ర్‌టైన‌ర్, మరిన్ని డీటెయిల్స్ ఇవిగో!


ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్'కు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మించారు. సినిమాలో పాటలు, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చాయి.


Also Read: ఈ వారం థియేటర్ / ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న తెలుగు, హిందీ చిత్రాలివే!