Radha Madhavam Movie First Look : తెలుగు తెరకు పల్లెటూరు ఎప్పుడూ హిట్ ఫార్ములాయే. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన మెజారిటీ ప్రేమ కథలు విజయాలు సాధించాయి. ఆ జానర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మరో పల్లెటూరి ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. అదీ రాధాకృష్ణులను గుర్తు చేసే టైటిల్ (Radha Madhavam)తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 


'రాధా మాధవం' ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరి
వినాయక్ దేశాయ్ కథానాయకుడిగా రూపొందుతున్న పల్లెటూరి ప్రేమకథా చిత్రం 'రాధా మాధవం'. ఇందులో అపర్ణా దేవి కథానాయిక. ఈ చిత్రాన్ని గోనల్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. కథ, మాటలతో పాటు పాటలను కూడా వసంత్ వెంకట్ బాలా అందించారు. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాంతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. 'పెళ్లి చూపులు'తో పాటు పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 


రాజ్ కందకూరి మాట్లాడుతూ... ''హీరోగా వినాయక్‌ దేశాయ్ రెండో చిత్రమిది. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే... మంచి పల్లెటూరి ప్రేమకథ చూడబోతున్నామని ఫీలింగ్ కలిగించింది. పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మన ప్రేక్షకులు చిన్నా పెద్దా అని తేడాలు చూడరు. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా'' అని చెప్పారు. తమను ఎంకరేజ్ చేస్తున్న రాజ్ కందుకూరికి హీరో వినాయక్ దేశాయ్ కృతజ్ఞతలు చెప్పారు. 


Also Read సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ మధ్య పోటీనా? మాజీ భార్య భర్తల మధ్య పోటీనా?






దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజ్ కందుకూరి గారికి థాంక్స్. గ్రామీణ నేపథ్యంలో ప్రేమను కొత్త కోణంలో చూపించే సినిమా ఇది. మా హీరో హీరోయిన్లు, నటీనటుల సహకారంతో సకాలంలో చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.  


Also Read : స్వాతి కోసం బెంగళూరు కాలేజీకి వెళ్ళిన బన్నీ - అప్పుడు ఏం జరిగిందంటే?



వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత:  గోనాల్ వెంకటేష్, దర్శకత్వం: దాసరి ఇస్సాకు, కథ - మాటలు - పాటలు: వసంత్ వెంకట్ బాలా, సంగీతం : చైతు కొల్లి, ఛాయాగ్రహణం: తాజ్ జీడీకే, కూర్పు: కె. రమేష్, పోరాటాలు: రాబిన్ సుబ్బు.