Bollywood Director Praise On Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' పై టాలీవుడ్ తో పాటూ ఇతర ఇండస్ట్రీలోనూ ఓ రేంజ్ లో క్రేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు 'పుష్ప 2' పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే 'పుష్ప 2' బాలీవుడ్ లో తన సినిమా కంటే అత్యధిక వసూళ్లు సాధిస్తుందని చెప్పడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే?
'పుష్ప 2' పై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనిల్ శర్మ గత ఏడాది 'గదర్ 2' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. గత ఏడాది బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 'గదర్ 2' కూడా ఒకటి. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన అనిల్ శర్మ తాజాగా 'పుష్ప 2' టీజర్ చూసి తన సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు." ఇప్పుడే పుష్ప 2 టీజర్ చూశా. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. గత ఏడాది ఆగస్టు 15న నేను దర్శకత్వం వహించిన 'గదర్ 2' థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది అదే రోజున విడుదల కాబోతున్న 'పుష్ప2', 'గదర్ 2' ను మించి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. తెలుగు సినీ పరిశ్రమ, చిత్ర బృందానికి నా అభినందనలు. స్పెషల్లీ అల్లు అర్జున్.. పుష్పరాజ్ గా అతని లుక్, నటన అత్యద్భుతంగా ఉంది" అని అన్నారు.
'పుష్ప 2' టీజర్ రేర్ రికార్డ్
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేసిన 'పుష్ప 2' టీజర్ సోషల్ మీడియాలో అత్యద్భుత స్పందన కనబరిచింది. అతి తక్కువ సమయంలో 110 మిలియన్ల వ్యూస్ ని 1.55 మిలియన్ల లైక్స్ ని అందుకొని టీజర్ గా ఘనత సాధించగా.. తాజాగా మరో రేర్ రికార్డ్ ని అందుకుంది. 'పుష్ప 2' టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్లో పిలిచిన ఏకైక టీజర్ గా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు మరే స్టార్ హీరో సినిమా టీజర్ ఇన్ని గంటల పాటు యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ వన్ నిలిచిన దాఖలాలు లేవు. సుమారు 300 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు చైనా, జపాన్, రష్యా వంటి పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read : ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?