Tritpi Dimri in War 2 : అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఈ మూవీ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఇటీవల ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో సుమారు పది రోజులపాటు తారక్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


'వార్ 2'లో 'యానిమల్' బ్యూటీ


'యానిమల్' మూవీతో బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ఎలాంటి పాపులారిటీని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. సినిమాలో కనిపించింది కాసేపే అయినా తన అందం, అభినయంతో ఓవర్ నైట్ నేషనల్ క్రష్ అయిపోయింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ రష్మిక మందన కంటే ఈ ముద్దుగుమ్మకే ఎక్కువ పాపులారిటీ వచ్చింది అంటే సినిమాలో ఆమె డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు 'వార్ 2' లో నటించే ఛాన్స్ కొట్టేసింది అంటూ బీ టౌన్ టాక్. అయితే 'వార్ 2' తృప్తి దిమ్రిని హృతిక్ సరసన తీసుకున్నారా? లేక ఎన్టీఆర్‌కు జోడిగా ఎంపిక చేశారా? అనే విషయంపై ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు.


'వార్ 2' లో ఎన్టీఆర్ ఓ సీక్రెట్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే 'యానిమల్' మూవీలోనూ తృప్తి సీక్రెట్ స్పై తరహా పాత్రలోనే నటించి ఆకట్టుకోవడంతో 'వార్ 2'లో ఆమెని ఎన్టీఆర్‌కు జోడిగా సెలక్ట్ చేశారని అంటున్నారు. దీనిపై మూవీ టీం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


'వార్ 2' కోసం 100 రోజుల కాల్ షీట్స్


జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2'తోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. సినిమాలో ఎన్టీఆర్ సీక్రెట్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక లేటెస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్‌పై మూవీ టీం కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. కాగా 'వార్ 2' కోసం ఎన్టీఆర్ ఏకంగా వంద రోజుల కాల్షీట్స్ ఇచ్చాడని తెలిసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నారు. 


Also Read : శరవేగంగా సాగుతోన్న రవితేజ మల్టిప్లెక్స్ నిర్మాణాలు - ఎక్క‌డో తెలుసా?