Pushpa 2 The Rule Reloaded : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో 2024 ఎండింగ్‌లో వచ్చిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ఏ విధంగా బాక్సాఫీస్‌ని రూల్ చేసిందో.. ఆ సినిమా సాధించిన కలెక్షన్లే తెలియజేశాయి. మరీ ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా రప్పా రప్పా అనేలా రఫ్ ఆడించేసి, భారీ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. పుష్పగాడి ర్యాంపేజ్‌కి ఎదురే లేదు అనేలా.. బాక్సాఫీస్ దాసోహమైంది. సంక్రాంతికి కొత్త సినిమాల విడుదల ఉండటంతో కాస్త ఊపు తగ్గినా.. మళ్లీ రీలోడెడ్ అంటూ మేకర్స్ చేసిన ప్రయత్నం మంచి ప్రయత్నాలను ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. 


20 నిమిషాల అదనపు సీన్లతో రీలోడెడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సినిమాలను బీట్ చేసి మరీ హౌస్‌ఫుల్ అవుతున్నట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్‌ని ఎంతగా డౌన్ చేసిందో తెలిసిందే. అలాంటి చోట కూడా ఈ సినిమా ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుంటూ.. హౌస్‌ఫుల్ అవుతుండటం విశేషం. మొత్తంగా అయితే ఈ రీలోడెడ్ వెర్షన్ మరోసారి ‘పుష్ప 2’ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ‘గేమ్ చేంజర్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ఈ ‘పుష్ప 2 రీ లోడెడ్’ వెర్షన్‌ని ప్రదర్శిస్తుండటం ఇప్పుడు వార్తలలో హైలెట్‌గా నిలుస్తోంది. సంక్రాంతి సినిమాలకు పోటీగా ఈ సినిమా టికెట్లు తెగుతుండటం మరో విశేషం. 


Read Also : Monday TV Movies: చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..


ఇక ఈ ‘పుష్ప 2’ రీలోడెడ్ వెర్షన్‌కి వస్తున్న స్పందనతో అల్లు అర్జున్ అభిమానులు మరోసారి సోషల్ మీడియాలో తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇది బన్నీ రేంజ్ అంటూ సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. అసలు ఈ సినిమాలో ఎక్కడ, ఏ సీన్ యాడ్ చేసి ఉంటారా? అనేది తెలుసుకోవడానికి.. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్లు కూడా క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే 17న రీలోడెడ్‌గా వచ్చిన ‘పుష్ప 2’ కలెక్షన్స్ రోజురోజుకీ పెరుగుతున్నాయని, మరోమారు పుష్పగాడి ర్యాంపేజ్ థియేటర్ల దగ్గర కనిపిస్తుందని ట్రేడ్ రిపోర్ట్స్ సైతం చెబుతున్నాయి. మరి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్‌లో యాడ్ చేసిన సన్నివేశాలేంటో తెలుసుకుందామా..  


‘పుష్ప 2- రీలోడెడ్ వెర్షన్‌’లో యాడ్ చేసిన సన్నివేశాలివే..




  • సినిమా స్టార్టింగ్‌లో వచ్చే జపాన్ ఎపిసోడ్ ఇంకాస్త లెంగ్తీగా ఉంటుంది. ఇంట్రడక్షన్‌ సీన్‌కు లింక్ చేసి సరికొత్తగా ఈ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు. 


  • ఎర్రచందనం చెన్నై బోర్డర్‌కు బళ్ల రూపంలో తరలించిన తరువాత షెకావత్‌, పుష్పరాజ్‌ మధ్య వచ్చే సంభాషణల సన్నివేశంలో మంగళం శ్రీను, దాక్షాయణిలకు మరికొన్ని డైలాగ్స్ యాడ్ చేశారు. ఈ డైలాగ్స్ పుష్పరాజ్ ఎలివేషన్‌కి సంబంధించి ఉంటాయి.


  • అదే సన్నివేశంలో ఎర్రచందనం అనుకుని సండ్రను పట్టుకున్న షెకావత్‌ వద్దకు అది ఎర్రచందనం అని తేల్చే కమిటీ రావడం, కొన్ని డైలాగ్స్ యాడ్ చేశారు.


  • జాతర సన్నివేశంలో పుష్ప అన్న కుమార్తె కావేరికి, పుష్ప భార్య శ్రీవల్లికి మధ్య కొన్ని సంభాషణలను యాడ్ చేశారు.


  • పుష్పరాజ్‌తో సిండికేట్‌ మీటింగ్‌‌ సమయంలో మొదటి వెర్షన్‌లో పుష్పకు సరైన డైలాగ్స్ లేవు.. కానీ ఈ రీలోడెడ్ వెర్షన్‌లో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ యాడ్ చేశారు.


  • జాలిరెడ్డి ఇంటికెళ్లి పుష్పరాజ్‌ మాట్లాడే సన్నివేశాలను యాడ్ చేశారు. 


  • రామేశ్వరం వద్ద సముద్రంలోపల నుండి ఎర్రచందనం శ్రీలంకకు పంపే సన్నివేశానికి ముందు యాక్సిడెంట్‌లో జపాన్‌ డీలర్‌ హామీద్‌, జక్కారెడ్డి చనిపోయే సన్నివేశం. హామీద్‌ను షెకావత్‌ చంపేసినట్లుగా చూపించారు.


  • క్లైమాక్స్‌లో అజయ్ కుమార్తె పెళ్లికి వెళ్లిన పుష్పరాజ్‌‌కు, చిన్నప్పుడు పుష్ప దగ్గర లాక్కున్న చైన్‌ను పుష్పరాజ్‌ మెడలో అజయ్ వేసే సెంటిమెంట్ సీన్‌ని యాడ్ చేశారు.



Also Read : బాక్సాఫీసు వద్ద వెంకీమామ దూకుడు - షాకిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' 5 రోజుల కలెక్షన్స్‌, ఎంతంటే!