Kiara Advani : బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ తాజాగా ఫోటోగ్రాఫర్లకు ముఖం చాటేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుండగా, దానికి కారణం రీసెంట్ గా ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్" రిజల్టే అంటూ టాక్ వినిపిస్తోంది.
'గేమ్ ఛేంజర్' రిజల్ట్ ఎఫెక్ట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పొలిటికల్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. 'ఆర్ఆర్ఆర్' వంటి ఆస్కార్ విన్నింగ్ మూవీ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన మూవీ ఇదే. దీంతో 'గేమ్ ఛేంజర్'పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి ముందు జనవరి 10న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. కానీ ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మాస్ ఆడియన్స్ కు పెద్దగా కనెక్ట్ కాలేదు. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా 186 కోట్లు కొల్లగొట్టిన 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ తరువాత తగ్గుముఖం పట్టాయి. దీంతో కలెక్షన్ల పరంగా కూడా ఈ మూవీ నిరాశ పరిచింది. ఈ మూవీ రిజల్ట్ ను పట్టించుకోకుండా ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టారు.
ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన కియారా అద్వానీ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ. బాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా ఈ బ్యూటీకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇవేమి గేమ్చేంజర్కి సక్సెస్‌ని అందిచలేకపోయాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'గేమ్ ఛేంజర్' బాక్స్ ఆఫీసు రిజల్ట్ కియారాను కూడా డిజప్పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం 'వార్ 2' సినిమాలో నటిస్తోంది కియరా. ఈ సందర్భంగా 'వార్ 2' మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీతో తాజాగా సమావేశమైంది. సమావేశం అనంతరం ఆమె ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇవ్వకుండా తప్పించుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా ఫోటోగ్రాఫర్లు కనిపించగానే స్మైల్ తో పలకరించి, ఫోటోలకు ఫోజులు ఇచ్చే ఈ అమ్మడు తాజాగా సైలెంట్ గా తన కార్లో కూర్చుని వెళ్లిపోయింది. దీంతో 'గేమ్ ఛేంజర్' మూవీ డిజాస్టర్ కారణంగానే ఆమె డిజప్పాయింట్ అయిందని, ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఫోటోలకు ఫోజులు ఇవ్వకుండా మీడియాకు ముఖం చాటేసిందని అంటున్నారు.
రెండు సినిమా కూడా సేమ్ రిజల్ట్
రామ్ చరణ్ - కియారా అద్వానీ జంటగా నటించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో 'వినయ విధేయ రామ' సినిమాలో వీరిద్దరూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. అయితే అప్పట్లో 'వినయ విధేయ రామ' సినిమా కూడా ఇలాగే భారీ అంచనాలతో రిలీజై, డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ వీరిద్దరి జోడి బాగుండడంతో 'గేమ్ ఛేంజర్'లో మళ్లీ రిపీట్ చేశారు. కానీ ఈసారి కూడా ఈ జంట స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. అలాగే 'గేమ్ ఛేంజర్' మూవీతో కియారా అద్వాని చేసిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రయత్నం బెడిసి కొట్టినట్టుగా అయ్యింది. మరి 'వార్ 2' మూవీతోనైనా ఈ బ్యూటీ సాలిడ్ కం బ్యాక్ ఇస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : బాక్సాఫీసు వద్ద వెంకీమామ దూకుడు - షాకిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' 5 రోజుల కలెక్షన్స్, ఎంతంటే!