Sankranthiki Vasthunam Box Office Collections: విక్టరి వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచాడు. 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఈ ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్‌లు పోటీపడ్డారు. చరణ్, బాలయ్య తర్వాత వచ్చిన వెంకీమామ గట్టి పోటీ ఇచ్చిన విన్నర్‌గా నిలిచారు. ఎన్నో అంచనాల మధ్య రామ్ చరణ్-శంకర్‌ల 'గేమ్ ఛేంజర్' వచ్చింది. బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికి ఈ చిత్రం సంక్రాంతి గేమ్ ఛేంజర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని ఆడియన్స్‌ని నిరాశపరిచింది. ఫస్ట్ డే మంచి వసూళ్లు తెచ్చిన ఆ తర్వాత ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ కరువైంది. ఆ తర్వాత జనవరి 12న వచ్చిన డాకు మహారాజ్ హిట్ టాక్ తెచ్చుకుంది.
సంక్రాంతికి వస్తున్నా 5 రోజుల కలెక్షన్స్
బాలయ్య మ్యానరీజాన్ని కంటిన్యూ చేస్తూ అదే యాక్షన్, ఎమోషన్‌తో బాబీ ఈ సినిమాను తీర్చిదిద్దారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా డిసెంట్ వసూళ్లుతొ పర్వాలేదు అనిపిస్తుంది. ఆ వెంటనే జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బరిలో దిగి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచిబ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీ, యాక్షన్, ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం పర్ఫెక్ట్ సంక్రాంతికి సినిమా అనిపించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దుమ్ములేపుతుంది. మూడు రోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లో చేరిన వెంకీమామ అదే జోరు చూపిస్తున్నాడు. దీంతో ఐదు రోజుల్లో ఈ సినిమా రూ. 161 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ పొంగల్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే ఈ వీకెండ్‌లోగా ఈజీగా రెండు వందల కోట్ల క్లబ్‌లో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.
ఓవర్సిస్‌లోనూ జోరుగా..
తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌పై మూవీ టీం అధికారిక ప్రకటన ఇస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పటికే మేకర్స్‌ని ప్రాఫిట్‌లో పడేసిన ఈ సినిమా సెకండ్ వీక్‌లోనూ అదే దూకుడు చూపించేలా కనిపిస్తుంది. ఓవర్సిస్‌లోనూ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఫుల్ జోరు చూపిస్తుంది. నార్త్ అమెరికాలో మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. వేలల్లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకు యూఎస్ బాక్సాఫీసు వద్ద రూ. 1.8 మిలియన్ల డాలర్లు రాబట్టినట్టు మూవీ టీం పేర్కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. దాదాపు రూ . 45 కోట్ల బడ్జెట్‌తో సంక్రాంతికి వస్తున్నాం రూపొందినట్టు సమాచారం.
గతేడాది సైంధవ్ డిజాస్టర్
వెంకటేష్ కొంతకాలంగా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్ కొడుతున్నారు. అయితే గతేడాది కూడా అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ సైంధవ్‌తో వచ్చాడు. మహేష్ బాబు 'గుంటూరు కారం', నాగార్జున 'నా సామిరంగ'. యువ హీరో తేజ సజ్జా హనుమాన్ చిత్రాలతో పాటు సైంధవ్‌ని సంక్రాంతి బరిలో దింపారు. గుంటూరు కారం సూపర్ హిట్, నా సామిరంగ పర్వాలేదు అనిపిచింది, హనుమాన్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కానీ 'సైంధవ్' మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని డిసప్పాయింట్ చేసిన వెంకీమామ ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీతో వచ్చి విజేత నిలిచాడు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీసు ఏలేస్తున్నాడు. ఫిబ్రవరి వరకు చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. కాబట్టి ఈ జనవరి అంతా థియేటర్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' సందడే కొనసాగనుంది.