Bigg Boss 18 Grand Finale : 'బిగ్ బాస్ 18' సెట్ లో ఓ షాకింగ్ ఘటన జరిగిందనే విషయం తాజాగా బయటకు వచ్చింది. ఆ ఊహించని సంఘటన కారణంగా ఇద్దరు స్టార్ హీరోల మధ్య వివాదం నెలకొందనే ఊహాగానాలు మొదలయ్యాయి. 'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ గా అక్షయ్ కుమార్ ను పిలిచి సల్మాన్ ఖాన్ గంటపాటు వెయిట్ చేయించాడట. దీంతో సహనం కోల్పోయిన అక్షయ్ షూటింగ్ లో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
అసలు ఏం జరిగిందంటే...
బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో అయితే ఇప్పుడు ఏకంగా 18వ సీజన్ నడుస్తోంది. నిన్న ఈ షోకు సంబంధించిన ఫినాలే జరగ్గా, అందులో విన్నర్ ను ప్రకటించారు. అయితే సాధారణంగా బిగ్ బాస్ సీజన్ ఫినాలేను ఏ భాషలో అయినా సరే గ్రాండ్ గా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఫినాలేలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పట్లాగే 'బిగ్ బాస్ సీజన్ 18' లో కూడా అమీర్ ఖాన్, అతని కుమారుడు జునైద్ ఖాన్, ఖుషి కపూర్ తదితరులు గ్రాండ్ ఫినాలే లో పాల్గొని, తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. కానీ ఇదే సెట్లో మరో బాలీవుడ్ బడాస్టర్ అక్షయ్ కుమార్ కి అవమానం జరిగిందని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో బ్యాడ్ ఫేజ్ లో ఉన్న అక్షయ్ కుమార్ 'బిగ్ బాస్ సీజన్ 18' గ్రాండ్ ఫినాలే రోజు తన కొత్త సినిమా 'స్కై ఫోర్స్'ను ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా 'బిగ్ బాస్ 18'లో అక్షయ్ కుమార్ పార్ట్ షూటింగ్ మధ్యాహ్నం 2:15 గంటలకు ప్లాన్ చేశారు. అయితే షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆయన దాదాపు గంటకు పైగా సెట్ లో వేచి ఉన్నప్పటికీ, సల్మాన్ ఖాన్ షూటింగ్ కి రాకపోవడంతో అసహనాన్ని వ్యక్తం చేశారట. చాలాసేపటి తరువాత సల్మాన్ ఇంకా సెట్ లో అడుగు పెట్టకపోవడంతో, అక్షయ్ కుమార్ అసహనంగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారని తెలుస్తోంది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్షయ్ కుమార్ ఫోన్ ఎత్తలేదు సరి కదా, అసలు మళ్లీ బిగ్ బాస్ సెట్ లో అడుగు పెట్టడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం ముందుగా కమిట్ అయిన కొన్ని కమిట్మెంట్ల కారణంగా షూటింగ్ కి లేటుగా వచ్చారని సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న సల్మాన్ మరోసారి ఆయనని షోలో పాల్గొనాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బిగ్ బాస్ కారణంగా ఇద్దరు స్టార్ హీరోల మధ్య గ్యాప్ పెరిగినట్టు తెలుస్తోంది.
'బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? ప్రైజ్ మనీ ఎంత ?
'బిగ్ బాస్ 18' 105 రోజుల ప్రయాణం ముగిసింది. 'బిగ్ బాస్ సీజన్ 18' ట్రోఫీ కరణ్‌వీర్ మెహ్రాను వరించింది. ఆయన ట్రోఫీతో పాటు కరణ్ 50 లక్షల భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఈ షోలో రన్నరప్‌గా వివియన్ ద్సేనా నిలిచారు. ఈసారి 'బిగ్ బాస్ 18' షోలో టాప్ 6 కంటెస్టెంట్లుగా కరణ్ వీర్ మెహ్రాతో పాటు వివియన్ ద్సేనా, అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్, రజత్ దలాల్ ఉన్నారు.