Kushboo Sundar Fitness Goals : సీనియర్ హీరోయిన్ కుష్బు తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. రాజకీయాలు ఫాలో అయ్యేవారికి కూడా కుష్బు తెలుసు. అయితే ఆమె హీరోయిన్‌గానే కాదు నటిగా కూడా నేటి తరానికి తెలుసు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. నటిగా, రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తున్నారు. అయితే కుష్బూ కూడా బరువు తగ్గడంలో చాలా ఇబ్బందులు పడ్డారట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపెట్టారు.
ఎన్నో డైట్లు చేశాను..
బరువు తగ్గేందుకు చాలామంది ఎన్నో డైట్లు చేస్తారు. కుష్బూ కూడా బరువు తగ్గేందుకు ఎన్నో రకాల డైట్లు ట్రై చేశారట. ఏవి ఆమెకు మంచి ఫలితాలు ఇవ్వలేదని తెలిపారు. ఫ్యాట్ లాస్ కాకపోవడంతో డైట్లను మానేసి.. మరో ట్రిక్ ట్రై చేశారట. అది మంచి ఫలితాలు ఇచ్చిందని.. అందుకే మూడేళ్లలో 32 కిలోలు తగ్గానని చెప్పారు కుష్బూ.
బరువు ఇలా తగ్గారట..
కుష్బూ జిమ్ పర్సన్ కానని తెలిపారు. అందుకే జిమ్‌కి వెళ్లేవారు కాదట. కానీ ఆమెకు నడక అంటే చాలా ఇష్టమని తెలిపారు. అలా అని జిమ్‌లో థ్రెడ్‌మిల్‌పై వాక్ చేయడం కాకుండా.. బయట నడిచేవారట. ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం 45 నిమిషాలు కచ్చితంగా వాక్ చేసేవారట. ఇలా నడవడం వల్ల ఆమె బరువు తగ్గినట్లు ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్ని పనులున్నా.. ఎక్కడున్నా వాకింగ్ మాత్రం స్కిప్ చేయరట కుష్బూ.
ఫుడ్‌లో చేసిన మార్పులివే..
ఫుడ్ విషయంలో డైట్ ఫాలో అవ్వలేదట కానీ.. కొన్ని మార్పులు చేశారట. వాకింగ్‌తో పాటు జంక్ ఫుడ్ పూర్తిగా మానేశారట. ఫ్రైడ్ ఫుడ్, స్పైసీ ఫుడ్ జోలికి పోలేదట. అలాగే తన డైట్నుంచి గ్లూటన్ని పూర్తిగా తీసేశారట. కానీ షుగర్‌ని పూర్తిగా కట్ డౌన్ చేయలేదని తెలిపారు. అలా అని చాక్లెట్లు తినడం కాకుండా.. ట్రెడీషనల్ స్వీట్స్ తిన్నట్లు కుష్బూ తెలిపారు. మామూలుగానే ఆమె ఫుడ్ ఎక్కువ తినరట. అలా తక్కువగా తినడం, వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గినట్లు తాజా ఇంటర్వ్యూలో తెలిపారు కుష్బూ.
మీరు కూడా ఇది ఫాలో అవ్వాలనుకుంటే..
మీరు కూడా ఈ రొటీన్ ఫాలో అయ్యి బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే.. బరువు తగ్గడంలో వాకింగ్ మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే 3 ఏళ్లలో 32 కిలోలు తగ్గుతారనేది చెప్పలేము. మీ శరీర తత్వాన్ని బట్టి బరువు తగ్గడం జరుగుతుంది. అలాగే వాకింగ్‌తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్‌పై ఫోకస్ పెట్టాలి. జిమ్‌కి వెళ్లకున్నా.. ఇంట్లోనే స్ట్రైంత్ ట్రైనింగ్ వ్యాయామాలు చేస్తే మంచిది. ఇది మీరు బరువు తగ్గడంతో పాటు ఫిట్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
డైట్ విషయానికొస్తే..
మీరు కూడా ఇదే డైట్ ఫాలో అవ్వాలని లేదు. కాస్త ఓపిక తెచ్చుకుని.. డైటీషియన్ దగ్గరకు వెళ్లి మీ లైఫ్‌స్టైల్‌కి తగ్గట్లుగా డైట్ చార్ట్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరానికి కావాల్సినవి అందిచకుండా బరువు తగ్గితే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని గుర్తించుకోవాలి.
Also Read : వ్యాయామం, డైట్ చేయలేకపోతున్నారా? అయితే బరువు తగ్గేందుకు ఆ ఒక్కటి మానేసి చూడండి