ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప: ది రూల్’.  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్  తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సినీ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆయన ‘పుష్ప2’ను తెరకెక్కిస్తున్నారు. 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో,  దాన్ని తలదన్నేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్ప’ మూవీ దుమ్మురేపింది. ఈ చిత్రంలో అద్భుత నటన కనబర్చిన అల్లు అర్జున్, ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపిక అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ హీరోకు దక్కని గౌరవం ఆయనకు దక్కింది. దీంతో ‘పుష్ప2’పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.


‘పుష్ప 2’ సెట్ ఫోటో షేర్ చేసిన రష్మిక


‘పుష్ప 2’ సినిమాక సంబంధించి వచ్చే అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ‘పుష్ప 2’ సెట్ కు సంబంధించిన ఫోటోను హీరోయిన్ రష్మిక మందన్నతన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న భారీ భవంతిలో రష్మిక, అల్లు అర్జున్ మధ్య సీన్లు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫ్యామిలీ సీన్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘పుష్ప2’  నుంచి పలు సీన్లు లీక్ అయ్యాయి. తాజాగా ‘పుష్ప 2’ మూవీ లారీలు అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తాజాగా  హీరోయిన్ రష్మిక సెట్ ఫోటో లీక్ చేయడంతో సినిమాపై మరింత ఆసక్తి కలిగిస్తోంది.     


 'పుష్ప- ది రూల్' విడుదలపై మేకర్స్ కీలక నిర్ణయం   


ఇక తాజాగా 'పుష్ప- ది రూల్' సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది(2024) మార్చి 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప2’ కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 75 శాతం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఇప్పటికే షూట్ చేశారట. చాలా వరకు వైజాగ్ లో ఈ సినిమాను షూట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప 2’ మూవీని  మైత్రీ మూవీ మేకర్స్,  సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Read Also: కంగనా రనౌత్ చెంప పగలగొట్టాలని ఉంది, పాకిస్థానీ నటి షాకింగ్ కామెంట్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial