ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2" జాతర డిసెంబర్ 5న మొదలైన సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ కి ముందే ఉన్న హైప్ ని దృష్టిలో పెట్టుకొని, పుష్ప రాజ్ ఇప్పటిదాకా చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి సినిమాల రికార్డులను తిరగ రాయడం ఖాయమని టాక్ నడిచింది. అనుకున్నట్టుగానే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇప్పటికే మొదటి రోజు భారీ కలెక్షన్లు కొల్లగొట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న 'ఆర్ఆర్ఆర్' ప్లేస్ ను కబ్జా చేశాడు పుష్పరాజ్.
'పుష్ప 2 : ది రూల్' మూవీ మొదటి రోజే ఇండియాలో రూ.165 కోట్ల నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా రికార్డును బ్రేక్ చేశాడు పుష్పరాజ్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇండియాలో ఫస్ట్ డే రూ.133 కోట్లు రాబట్టింది. అయితే 'పుష్ప 2' మూవీ మాత్రం రూ.165 కోట్లు రాబట్టి, రాజమౌళి సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. డిసెంబర్ 4న పడిన 'పుష్ప 2' ప్రీమియర్ షోలకు రూ. 10.1 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్టు సమాచారం. ప్రీమియర్ షోలతో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలను కలిపితే 'పుష్ప 2 : ది రూల్' మూవీ ఇండియాలోనే రూ. 175.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఒక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు... షారుఖ్ ఖాన్ 'జవాన్', ప్రభాస్ 'బాహుబలి' రికార్డులను సైతం వెనక్కి నెట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 280 కోట్లు దాటిందని టాక్.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
ఇందులో తెలుగులోనే రూ. 95.1 కోట్లు రాబట్టడం విశేషం. ఆ తరువాత భారీ హైప్ ఉన్న హిందీ వెర్షన్ లో రూ. 67 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టాడు పుష్ప. ఇక తమిళంలో రూ. 7 కోట్లు, కర్ణాటకలో రూ.1 కోటి, మలయాళంలో రూ. 5 కోట్ల వసూళ్లు ఉండడం విశేషం. నిజానికి ప్రీమియర్ షోలు కేవలం తెలుగులో మాత్రమే వేశారు. ఈ క్రమంలోనే అన్ని భాషల్లో కంటే ఎక్కువగా 'పుష్ప 2' మూవీకి తెలుగులోనే భారీగా కలెక్షన్స్ వచ్చాయి. వీక్ డే అయిన గురువారం రోజు రిలీజ్ అయిన 'పుష్ప 2' మూవీకి తెలుగులో 82.66 శాతం ఆక్యుపెన్సి నమోదయింది. అందులో ఎక్కువ శాతం నైట్ షోలే ఉండడం గమనార్హం. ఇక హిందీలో 59.83% ఆక్యుపెన్సి ఉంది.. దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్, చెన్నై, జైపూర్ వంటి నగరాల్లో అత్యధిక షోలు పడ్డాయి.
కాగా 'పుష్ప 2' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఇంకా తేలలేదు. యూఎస్ తో పాటు ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఈ సినిమాకు భారీ ప్రీ సేల్ బుకింగ్స్ జరిగాయి. కాబట్టి ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ గా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే గనక జరిగితే 'పుష్ప ' మూవీ ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా చరిత్రను సృష్టిస్తుంది. ఇప్పటిదాకా 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 223 కోట్ల ఓపెనింగ్ సాధించగా, 'బాహుబలి 2' మూవీ రూ.217 కోట్లు కొల్లగొట్టి రెండోస్థానంలో ఉంది. ఒకవేళ పుష్ప గనుక మొదటి రోజే రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే... రాజమౌళి సినిమాల రికార్డులను పాతరేసి, సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేయడం ఖాయం. అందుకే 'పుష్ప 2' ఓవర్సీస్ లెక్కలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read Also : Sukumar: 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకూ... సుకుమార్ హీరోలలో ఈ లోపాలు గమనించారా?