క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా సినిమాలో ఆయన మార్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే సుకుమార్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే సుకుమార్ సినిమాలలో హీరోలకు ఏదో ఒక లోపం ఉంటుంది అన్న విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? హీరో క్యారెక్టరైజేషన్ ను కొత్తగా చెక్కే విధానమే ఆయనను దర్శకులందు దర్శకుడు సుకుమార్ వేరయా అన్పించేలా చేసింది.
ఆర్య నుంచి పుష్పటు వరకు... కొన్ని సినిమాలు తప్పితే, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలలో హీరోకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే నిజానికి సుకుమార్ హీరోలకు లోపం ఉన్నప్పటికీ, వాళ్ల ఇంటెలిజెన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సుకుమార్ ఫస్ట్ మూవీ 'ఆర్య' నుంచి చూసుకుంటే... అందులో అల్లు అర్జున్ ఈ సినిమాలో ఆల్రెడీ వేరొకరితో ప్రేమలో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను కాపాడుకోవడానికి ప్రాణం పెడతాడు. పైగా ప్రేమించిన అమ్మాయిని తనకు నచ్చిన అబ్బాయి దగ్గరకు చేర్చడానికి పోరాడతాడు. ఇదేం లోపం కాదు... కానీ అదే 'ఆర్య'కు ఉండే యూనిక్ నెస్ అని చెప్పవచ్చు. పోరాడు ఓడాడు అనుకునే లోపే గెలుస్తాడు హీరో. ఎఏ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉంటుంది.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
'జగడం'లో హీరో ఏకంగా గ్యాంగ్స్టర్లను ఆరాధించడంతో పాటు మరో వ్యక్తిగా మారాలని కోరుకుంటాడు. హీరోలోనే విలన్ క్యారెక్టర్ ను ఈ మూవీ ద్వారా అప్పట్లోనే పరిచయం చేశారు సుక్కూ. 'ఆర్య 2'లో అల్లు అర్జున్ క్యారెక్టర్ టాక్సిక్ గా ఉంటుంది. అలాగే '1 నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబుకు మెమొరీ సమస్య ఉంటుంది. ఇక 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ కు లెక్కలపై మంచి పట్టు ఉంటుంది. 'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ కి చెవుడు, 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా సుకుమార్ రూపొందించే ప్రతి సినిమాలోనూ హీరోకి ఏదో ఒక లోపం లేదంటే హై ఇంటెలిజెన్స్ ఉంటాయి. అయితే అవి సినిమాకు మైనస్ కాదు. పైగా ప్లస్ పాయింట్స్ గా మారడం అన్నది సుకుమార్ ఇంటెలిజెన్స్ అని చెప్పాలి. ఆయన సినిమాలలో హీరోలకు ఉండే మైనస్ పాయింట్స్ ఆ పాత్రలను మరింత స్ట్రాంగ్ గా చేస్తాయి.
ఇక సుకుమార్ కథ చెప్పే విధానం కూడా మిగతా దర్శకులతో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కో సినిమాలో ఒక్కో స్టోరీ లైన్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తాడు. '1 నేనొక్కడినే' సినిమాలో హీరోని చిన్ననాటి జ్ఞాపకాలు వెంటాడితే, 'రంగస్థలం' సినిమా రివేంజ్ డ్రామాగా రూపొందింది. అలాగే సుకుమార్ సినిమాల ఎండింగ్ పూర్తిగా హ్యాపీగా ఉండదు. కానీ ప్రేక్షకుడిని మాత్రం ఎమోషనల్ గా సంతృప్తి చెందేలా చేస్తాడు. అంతే కాకుండా సుకుమార్ సినిమాలలో ఫిమేల్ లీడ్ కథను నడిపిస్తుంది. మొత్తానికి సుకుమార్ తన ఇంటెలిజెన్స్ తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసే పాత్రలను క్రియేట్ చేస్తాడన్నమాట. అందుకే కదా ఆయనను క్రియేటివ్ డైరెక్టర్ అనేది.