పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక సునామిలా మారింది పరిస్థితి. ఆయన ఏం మాట్లాడినా సరే నేషనల్ వైడ్ గా నిమిషాల్లో వైరాల అవుతోంది. గత ఎలక్షన్స్ లో ఆయన గెలవడం నుంచి మొదలైంది ఈ ఉత్సాహం. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడం, మరోవైపు సినిమాలు చేయడం.. ఇలా బిజీబిజీగా ఉన్నారు పవన్. ఈ క్రమంలో ఆయన ఏం చేసినా సరే అభిమానులు ఊగిపోతున్నారు. ఇక ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆణిముత్యమే అన్నట్టుగా ఉంది సిచువేషన్. పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఎప్పుడు, ఏ మాట కాస్త ట్రెండీగా వచ్చినా నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో వదిలిన డైలాగ్ 'సీజ్ ది షిప్' జోరుగా వినిపించింది. అయితే తాజాగా ఇదే పదంతో ఓ సినిమా టైటిల్ రిజిస్టర్ కావడం విశేషం. 


రీసెంట్ గా కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా కాకినాడకు వెళ్లారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి కాకినాడ పోర్టును సందర్శించిన ఆయన పోర్టుకు పది మైళ్ళ దూరంలో ఉన్న విదేశీ షిప్ ను గమనించారు. అయితే ఆ టైంలో కాకినాడ ఎస్పీ సెలవు పై ఉన్నాడంటూ, పవన్ ను షిప్ వద్దకు వెళ్లకుండా అక్కడి అధికారులు చేసిన ప్రయత్నం రాజకీయ వివాదానికి దారి తీసింది. అయినప్పటికీ పవన్ డేరింగ్ గా ఆ విదేశీ షిప్ దగ్గరికి చేరుకుని అక్కడ జరుగుతున్న బియ్యం అక్రమాలను పరిశీలించారు.


Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?



ఆ బియ్యంలో పేదలకు చెందాల్సిన రేషన్ సరుకు ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన పవన్... 'సీజ్ ది షిప్' అంటూ అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చేసిన 'సీజ్ ది షిప్' కామెంట్ జోరుగా వైరల్ అయింది. జనసేన పార్టీ నాయకులు, పవర్ స్టార్ అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుండటంతో ఆ వీడియో మరింత వైరల్ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ పాపులర్ డైలాగ్ 'సీజ్ ది షిప్' పేరుతో తెలుగు సినిమా టైటిల్ రిజిస్టర్ కావడం విశేషం. 


'సీజ్ ది షిప్' అనే సినిమా టైటిల్ ను ఆర్ ఫిలిం ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేసుకుంది. ఈ మేరకు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ లో రూ. 1100 చెల్లించి టైటిల్ ని అధికారికంగా తమ సొంతం చేసుకుంది. అంతే కాకుండా సదరు నిర్మాణ సంస్థ ఈ టైటిల్ పై మూవీని నిర్మించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ టైటిల్ కు ఏడాది పాటు టైం ఉంటుంది. ఏడాదిలోగా సినిమాను స్టార్ట్ చేసి ఛాంబర్ కు తెలియచేస్తే, సినిమా పూర్తయ్యే వరకు ఆ టైటిల్ ని ఇతరులు ఉపయోగించుకోకుండా టైంను పొడిగిస్తారు. లేదంటే ఆ టైటిల్ మరొకరు సొంతమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరు? ఎవరి దర్శకత్వంలో ఈ మూవీ తెరపైకి రాబోతోంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ చెప్పిన సీన్స్ తో పాటు గతంలో ఆయన చేసిన 'మనల్నెవడ్రా ఆపేది' అనే డైలాగ్ కూడా తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.


Also Readపుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?