Prudhvi Raj: ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. కౌంటర్స్, రీ కౌంటర్స్‌తో సోషల్ మీడియా నిండిపోతోంది. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎలక్షన్స్‌లో సెలబ్రిటీల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా ప్రచారాల్లోకి దిగారు సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వి రాజ్. వైసీపీ నుంచి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన యాంకర్ శ్యామల, మంత్రి రోజా ఉన్నారు. దీంతో తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో వైసీపీ, వైఎస్ జగన్ సపోర్టర్స్‌ను విమర్శిస్తూ పృథ్వి రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోసాని కృష్ణమురళీని సైతం విమర్శిస్తూ పృథ్వి రాజ్ కౌంటర్స్ విసిరారు.
ఆడదానివి కాబట్టి వదిలేశాం..
రోజాను డైమండ్ రాణి అని సంభోదిస్తూ.. ‘‘ఆవిడ జనసైనికులను రెచ్చగొట్టడానికి మిడిల్ ఫింగర్ చూపిస్తూ గుడ్ మార్నింగ్ చెప్పింది. చంద్రబాబును దరిద్రుడు అంటూ ఆయన జైలులో ఉంటే మరో దరిద్రుడు సపోర్ట్ చేశాడంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నువ్వు ఆడదానివి కాబట్టి అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా మేము వదిలేశాం. రోజా.. చిరంజీవి ఇంటికి వచ్చినప్పుడు మేము ఎవ్వరం చూడకూడదని గదిలో వెళ్లి కూర్చున్నాం. ఆయన మాత్రం ఆమెకు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించి పంపిస్తే.. తరువాతి రోజే పవన్ కళ్యాణ్ గాడిదలాంటివాడు, 55 ఏళ్లు ఉన్నాయి అన్నది. నీకు కూడా 52 ఉన్నాయి కదా’’ అంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పృథ్వి రాజ్.
ఛీ అంటున్నారు..
దమ్ముంటే తిరుపతిలో ఒక మీటింగ్‌కు వచ్చి నిలబడమని పోసాని కృష్ణమురళికి ఛాలెంజ్ విసిరారు పృథ్వి రాజ్. ఆపై యాంకర్ శ్యామల గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ‘‘యాంకర్ శ్యామల అంట. ఆమె బెట్టింగ్ రాణి. బెట్టింగ్ యాప్స్‌కే యాంకరింగ్ చేస్తుంది. ఆమె వచ్చి వైజాగ్‌లో మాట్లాడుతుంటే మహిళలు అంతా ఛీ అంటున్నారు. రోడ్డు బ్రహ్మండంగా ఉన్నాయి, జగనన్న పాలన రామరాజ్యంలాగా ఉంది అంటుంటే.. పోసాని డైలాగులా.. ఏం మాట్లాడుతున్నావు రా.. నరాలు కట్ అయిపోయాయి.. అనుకుంటున్నారు ప్రజలు. వీటన్నింటికి చరమగీతం పడుతుంది’’ అంటూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ఒక్కొక్కరిపై సీరియస్‌గా ఫైర్ అయ్యారు పృథ్వి రాజ్.
శ్యామలపై ఫోకస్..
ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి చాలామంది సెలబ్రిటీలు.. జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గానే నిలబడుతున్నారు. కానీ బుల్లితెర యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామల మాత్రం వైసీపీకి సపోర్ట్‌గా ప్రచారాలు ప్రారంభించి అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతే కాకుండా వైసీపీ ప్రచారకర్తగా యాక్టివ్‌గా పాల్గొంటున్న శ్యామల.. పవన్ కళ్యాణ్‌పై ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు కురిపిస్తోంది. అంతే కాకుండా చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో ఆఫ్ స్క్రీన్ తనతో సన్నిహితంగా ఉండేవారు కూడా రాజకీయాల విషయానికి వచ్చేసరికి తనపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. శ్యామల మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏపీ అంతా తిరుగుతూ వైసీపీకి సపోర్ట్ చేసే పనిలో బిజీగా ఉంది. అంతే కాకుండా వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభల్లో కూడా తను యాక్టివ్‌గా పాల్గొంటోంది. అందులో పృథ్వి రాజ్ కూడా యాడ్ అయ్యారు.
Also Read: షర్మిల కంట్రోల్ తప్పింది - తోడేలు, గుంటనక్కల కథ చెప్పిన యాంకర్ శ్యామలా.. ఆమె టార్గెట్ వారేనా?