తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు సగటు సినీ ప్రేక్షకులకు సైతం తెలిసినవే. వేతనాలు 30 శాతం పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు సమ్మెకు దిగారు. తమకు మద్దతు ఇవ్వకుండా చిత్రీకరణకు వెళ్లిన కొందరి మీద దాడికి దిగారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh)తో టాలీవుడ్ ఛాంబర్ పెద్దలు, తెలుగు సినిమా నిర్మాతలు కొందరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


అమరావతి వెళ్లిన టాలీవుడ్ పెద్దలు!
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ సహా సీనియర్ & యంగ్ ప్రొడ్యూసర్లు బీవీఎస్ఎన్ ప్రసాద్, డీవీవీ దానయ్య, కేఎల్ నారాయణ, సూర్యదేవర నాగ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ వై & సీఈవో చెర్రీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, వివేక్ కూచిభొట్ల, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి సోమవారం ఉదయం అమరావతి వెళ్లారు.


Also Readమాటలు రాని వీరాభిమానికి ఎన్టీఆర్ సర్‌ప్రైజ్... 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ సీన్


మధ్యాహ్నం 12కు ప్రారంభమైన భేటీ
సోమవారం (ఆగస్టు 11వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతలు సమావేశం అయ్యారు. గంటన్నరకు పైగా భేటీ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తెలుగు చిత్రసీమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను మంత్రికి నిర్మాతలు వివరించడంతో పాటు ఆ వివరాలు తెలియజేయనున్నారు.


Also Read: తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరూ ఆపలేరు - 'వార్ 2' ఈవెంట్‌లో తారక్