రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని చల్లగా చూడాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ కోరింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోతెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తమ సమస్యలను వివరించారు. చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్‌తో పాటు నిర్మాతలు సి.కల్యాణ్, ప్రసన్నకుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సినిమా పరిశ్రమలో పెద్దవాళ్లు కొంత మందే ఉంటారని..  కానీ రోజు పని చేస్తే తప్ప పూట గడవని వాళ్లు ఎంతో మంది ఉంటారని సి.కల్యాణ్ వివరించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దీవెనలు ఉంటే సినీ పరిశ్రమ చల్లగా ఉంటుందన్నారు. 


Also Read : బాలకృష్ణతో మోహన్‌బాబు, విష్ణు భేటీ.. అందరినీ కలుపుకుని వెళ్తానన్న "మా" ప్రెసిడెంట్ !


ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి వంద శాతం ఆక్యుపెన్సీకి.. రోజుకు నాలుగు షోలకు అనుమతి ఇవ్వడంపై నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంలో తాము యాభై శాతం సీటింగ్ ఆంక్షలను తొలగించాలని కోరామని.. ఆ మేరకు తొలగించినందుకు సంతోషమన్నారు. అయితే ఇండస్ట్రీకి ఇంకా సమస్యలు ఉన్నాయని.. వాటిని కూడా పరిష్కరించాలన్నారు. ధియేటర్లకు విద్యుత్ చార్జీల సమస్యలు.. షూటింగ్‌లకు పర్మిషన్లు,  పన్నుల  భారం ఉందన్నారు. కరోనా కారణంగా ధియేటర్లు దారుణంగా దెబ్బతిన్నాయన్న కారణంగా కర్ణాటకలో సింగిల్ స్క్రీన్ ధియేటర్లపై ట్యాక్స్ రద్దు చేశారని సి.కల్యాణ్ అన్నారు .


Also Read : " మా" సీసీ ఫుటేజీ కావాలన్న ప్రకాష్ రాజ్ - ఇస్తామన్న ఎన్నికల అధికారి !


త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలుస్తామని.. ఇండస్ట్రీ సమస్యలను విన్నవించుకుంటామని సి.కల్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ప్రధాన సమస్యగా  టిక్కెట్ రేట్లు ఉన్నాయన్నారు. అతి తక్కువ రేట్లతో సినిమా ధియేటర్లను నిర్వహించడం.. సినిమాలను నిర్మించడం సాధ్యం కాదన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సమస్యలను పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు అందరూ సినీ పరిశ్రమకు సహకరిస్తున్నారని.. పేర్ని నాని కూడా తమ సమస్యలను సావధానంగా విని ముఖ్యమంత్రికి చెప్పారన్నారు.



ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు ప్రధానంగా ఏపీ ప్రభుత్వానికే విజ్ఞప్తులు చేశారు. తమను చల్లగా చూడాలని కోరారు. అదే సమయంలో కొంత మంది పెద్ద వాళ్లతే ఇండస్ట్రీ కాదని.. కొన్ని వేల మంది ఉపాధి పొందుతూ ఉంటారని..  పాత తరహాలో సినిమాలు ప్రదర్శించుకునే అవకాశం.. టిక్కెట్ రేట్ల అంశం గురించి పరిశీలించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ముఖ్యమైన సమస్యగా ఉన్న వంద శాతం ఆక్యుపెన్సీ,  నాలుగు షోల అవకాశం కల్పించడంతో  నిర్మాతలు కాస్త రిలీఫ్ ఫీలయ్యారు. 


Also Read : పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి