దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ 2017లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ప్రభాస్, అనుష్క హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1900 కోట్ల కలెక్షన్ సాధించింది. హిందీలోనూ ఈ సినిమా సరికొత్త రికార్డులు నెలకొలపింది. ‘బాహుబలి2’ విడుదలై 7 ఏండ్లు గడుస్తున్నా ఆ మూవీ నెలకొల్పిన రికార్డులను ఏ సినిమా బీట్ చేయలేకపోయింది. కానీ, తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘బాహుమలి 2’ హిందీ రికార్డును బద్దలు కొట్టింది. జక్కన్న సినిమాను మించి వసూళ్లను సాధించింది.
'బాహుబలి 2' రికార్డు బ్రేక్ పై శోభు యార్లగడ్డ ఏమన్నారంటే?
‘బాహుబలి 2’ రికార్డులను ‘పఠాన్’ బీట్ చేయడం పట్ల నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. హిందీ బెల్ట్ లో తమ సినిమా రికార్డులను బీట్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా ‘పఠాన్’ టీమ్ ను అభినందించారు. “మా ‘బాహుబలి 2’ మూవీ హిందీ వెర్షన్ కలెక్షన్ రికార్డులని షారుక్ ‘పఠాన్’ సినిమా బద్దలు కొట్టడం సంతోషంగా ఉంది. ‘పఠాన్’ టీమ్ కి ప్రత్యేకంగా అభినందనలు. రికార్డులు అనేవి సృష్టించబడేది బద్దలు కొట్టడానికే” అని శోభు అభిప్రాయపడ్డారు. ఆయన ట్వీట్ పై సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శోభులోని పాజిటివిటీకి ఈ ట్వీట్ నిదర్శనం అని అభినందిస్తున్నారు.
‘పఠాన్’ కలెక్షన్ ఎంత?
'బాహుబలి 2' హిందీలో భారీ విజయం సాధించడమే కాదు, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా చరిత్రకు ఎక్కింది. 'బాహుబలి 2' హిందీ వెర్షన్ రూ. 510 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ 'పఠాన్' సినిమా బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు 'పఠాన్' సినిమా రూ. 530 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతోంది. సినిమాకు ఇంకా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా మాత్రమే కాదు, ఫస్ట్ డే, ఫస్ట్ వీక్, ఫస్ట్ మంత్ - ఇలా 'బాహుబలి ' క్రియేట్ చేసిన చాలా రికార్డులను 'పఠాన్' బీట్ చేసింది.
ఏడేళ్లకు 'బాహుబలి 2' రికార్డు బ్రేక్!
సౌత్ సినిమా అయిన 'బాహుబలి 2' క్రియేట్ చేసిన రికార్డులు బీట్ చేయడానికి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఏడు ఏళ్ళు పట్టింది. ఇక కలెక్షన్ల పరంగా షారుఖ్, ప్రభాస్ ఒకటి, రెండు స్థానాల్లో ఉంటే, ఆ తర్వాత కన్నడ సెన్సేషన్ యశ్ హీరోగా నటించిన 'కె.జి.యఫ్ : చాఫ్టర్ 2' ఉంది. ఆ సినిమా రూ. 434 కోట్లు కలెక్ట్ చేసింది. అమీర్ ఖాన్ 'దంగల్' (రూ. 387.38 కోట్లు)తో 4వ స్థానంలో, రణబీర్కపూర్ 'సంజు' (రూ. 342 కోట్లు)తో 5 స్థానంలో ఉన్నాయి. ఈ వసూళ్లు హిందీ బెల్ట్ లోవి మాత్రమే.
Read Also: ఆహా ఎంత బాగుంది, ఆకట్టుకుంటున్న ‘అన్నీ మంచిశకునములే’ టీజర్!