GunturKaaram Naga Vamsi Reaction: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా విడుదలై నెగిటివ్ టాక్ ని మూటకట్టుకుంది. మహేష్, త్రివిక్రమ్  11 ఏళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో రిలీజ్ కి ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత అభిమానులతో పాటు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ఇక క్రిటిక్స్ నుంచి కూడా సినిమాకి యావరేజ్ రివ్యూస్ వచ్చాయి. అయితే క్రిటిక్స్ ఒపీనియన్, టాక్ కి సంబంధం లేకుండా గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.


తాజాగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే 212 కోట్లు రాబట్టి సినిమాలో 90% బిజినెస్ రికవర్ చేసింది. డివైడ్ టాక్ తోనే సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అని ఎవ్వరూ అనుకోలేదు. సినిమాలో మహేష్ క్యారెక్టరైజేషన్, నటన, డాన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం.. అలాగే  సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉండడంతో సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. కేవలం రీజనల్ సినిమాతోనే రూ.200 కోట్లు కొల్లగొట్టడం ఇప్పటివరకు మహేష్ కి తప్ప మరో హీరోకి సాధ్యపడలేదు. ఇదిలా ఉంటే గుంటూరు కారం మూవీ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో గుంటూరు కారం సినిమా గురించి, కలెక్షన్స్ గురించి, రిజల్ట్ గురించి మాట్లాడారు.


" జనవరి 12 కు సినిమా రిలీజ్ అనుకుంటే నాలుగో తేదీ వరకు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంది. డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ మా సినిమా ఇలా ఉంటుంది అని చెప్పుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి సరిగ్గా టైం కుదరలేదు. ముందు హైదరాబాదులో ఒక ఈవెంట్ అనుకుంటే పోలీస్ పర్మిషన్స్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఆంధ్రాలో పెట్టాల్సి వచ్చింది. అలా ఈ సినిమాను మేమే సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయాం. మా సైడ్ నుంచి అదే మా తప్పని అనుకుంటున్నాం" అని అన్నారు.


" అర్దరాత్రి షోలు వేయడంతో.. మాస్ సినిమా అని అనుకున్న ఫ్యాన్స్ కాస్త నిరాశ పడి ఉండొచ్చు.. కాబట్టి కొంత నెగిటివిటి వచ్చింది. కానీ మధ్యాహ్నం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాక సినిమాకి బాగా కనెక్ట్ అయి పాజిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి అన్ని థియేటర్స్ ఫుల్ అయి మంచి రిజల్ట్ వచ్చింది. రివ్యూలు, సోషల్ మీడియాలో మార్నింగ్ వచ్చిన టాక్ చూసి వాటి వాళ్ళ కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ సాయంత్రం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చాక సినిమా హిట్ టాక్ వచ్చింది. అందుకే ఈరోజు సినిమాకి ఇంత మంచి కలెక్షన్స్ వచ్చాయి" అంటూ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.  అయితే సినిమా కలెక్షన్లకు సంబంధించి ప్రొడ్యూసర్లు  చెప్పే నెంబర్లు నిజం కాదని తాము ఎప్పటికీ వాస్తవాలు చెప్పమని నాగవంశీేనే ఓ ఇంటర్వూలో చెప్పారు. మరిప్పుడు బయటకు చెప్పిన నెంబర్లలో నిజం ఎంతుందో వాళ్లకే తెలియాలి. Also Read : ఓటీటీలోకి వచ్చేసిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' - స్ట్రీమింగ్ ఎక్కడంటే?