Nithiin’s Extra Ordinary Man OTT Release : లవర్ బాయ్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇప్పుడు ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది జనవరి 19 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైలర్ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 8న థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. గత కొన్నాళ్లుగా అటు నితిన్ ఇటు వక్కంతం వంశీ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 'భీష్మ' తర్వాత నితిన్ కి మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ దక్కలేదు.
'నా పేరు సూర్య'తో దర్శకుడిగా తొలి ప్రయత్నంతో అపజయం అందుకున్న వంశీ కచ్చితంగా ఈసారి కం బ్యాక్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని ప్లాప్ గా మిగిలిపోయింది. సినిమాలో నితిన్, శ్రీలీల డాన్స్, సాంగ్స్ మాత్రమే ఈ చిత్రానికి హైలెట్ అయ్యాయి. నిజానికి ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచిరెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాకు బజ్ తెచ్చిపెట్టాయి. కానీ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది.
అందుకు కారణం సరైన సమయంలో సినిమాని విడుదల చేయకపోవడం, మౌత్ టాక్ బలహీనంగా ఉండటం, 'హాయ్ నాన్న' సినిమాతో పోటీ వంటివి ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఫలితంగా భారీ నష్టాలను అందుకుని నితిన్ కెరీర్లో మరో ప్లాప్ గా నిలిచింది. అయితే థియేటర్లలో రిలీజైన దాదాపు నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయగా.. అర్దరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈచిత్రాన్ని ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది చూసేయండి. కాగా సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, సంపత్ రాజా, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆదిత్య మూవీస్ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. ఆర్థర్ ఏ. విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read : 'పుష్ప 2' ముగింపు లేని కథ - మీ ఎంటర్టైన్మెంట్‌కు ఎలాంటి ఢోకా లేదు: రష్మిక మందన