Devarakonda Brothers Vs Mega Brothers : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబీ(Baby)' ఇటీవలే విడుదలై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'బేబీ' ఆనంద్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమాపై ముందు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి స్పందన వచ్చింది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. కేవలం 5 రోజుల్లోనే రూ.18 కోట్ల షేర్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. దాదాపు రూ. 9 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లో అద్భుతంగా రన్ అవుతోంది.


ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడమే కాకుండా, బేబీలో నిరుత్సాహపడిన ప్రేమికుడిగా ఆనంద్ తన ఆకట్టుకునే నటనకు ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం మూవీలోని నటీనటులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మంచి కథను అందించారని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్.. దేవరకొండ సోదరులు ఆనంద్, విజయ్‌ల మధ్య పోలికలను చూపుతూ ఆయన తాజాగా చేసిన కామంట్స్ ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.


Read Also : Mithunam Story Writer Sri Ramana: 'మిథునం' రచయిత శ్రీరమణ కన్నుమూత


"మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత బ్లాక్ బస్టర్స్ అందించిన ఇద్దరు స్టార్ బ్రదర్స్ దేవరకొండలు మాత్రమే" అని బన్నీ వాసు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే కుటుంబంలో ఇద్దరు స్టార్లు ఉండటం చాలా అరుదు అన్న ఆయన.. ఇద్దరూ కల్ట్ బ్లాక్ బస్టర్స్ (అర్జున్ రెడ్డి, బేబీ) అందించారని ఈ సందర్భంగా వాసు గుర్తు చేశారు. ఆనంద్ 'బేబీ'తో ఇంత భారీ హిట్‌ను అందించినందుకు దేవరకొండ సోదరుల అభిమానులు ఎంతగానో థ్రిల్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.


దీంతో వాసు వ్యాఖ్యలపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. మెగా బ్రదర్స్ తో దేవరకొండ బ్రదర్స్ ను పోలిక చేసి చెప్పడమేంటీ అని కొందరు మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తుండగా.. మరో పక్క తమ ఫేవరేట్ దేవరకొండ బ్రదర్స్ ను, మెగా బ్రదర్స్ తో పోల్చినందుకు మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాసు చేసిన కామెంట్స్ పై ఇప్పటివరకు అటు మెగా బ్రదర్స్ గానీ, అటు దేవరకొండ బ్రదర్స్ గానీ రియాక్ట్ కాలేదు. ఈ వ్యాఖ్యలను వారు సమర్థిస్తారా లేదంటే.. ఇంకేమైనా అంటారా అని నెటిజన్లు వారి రిప్లై కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Read Also : Jeevitha Rajasekhar: జీవిత, రాజశేఖర్‌‌లకు జైలుశిక్ష - చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పరువునష్టం కేసులో కీలక తీర్పు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial