Producer Aswini Dutt About Prabhas Kalki Part 2 Shooting: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిజంగా ఇది సూపర్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898 AD' మూవీ సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. 

ప్రొడ్యూసర్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్

మూవీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ 'కల్కి 2'పై స్పందించారు. ఈ మూవీ షూటింగ్ సెప్టెంబరులో స్టార్ట్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మూవీ టీం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని... ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మికంగా భారీ స్థాయిలో సినిమా నిర్మించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది సమ్మర్‌‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.

ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, శోభన, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: 'మైసా' మూవీపై విజయ్ దేవరకొండ పోస్ట్ - రష్మిక ఎంత క్యూట్‌గా రియాక్ట్ అయ్యారో తెలుసా?

ఏడాది పూర్తి

గతేడాది 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి 2898 AD' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసేలా ఓ విజువల్ వండర్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన కల్కి దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శుక్రవారంతో ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తి కాగా... 'వన్ ఇయర్ ఫర్ కల్కి' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది. కల్కి పార్ట్ 2 కోసం వెయిటింగ్ అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'కల్కి 2'పై ఏ చిన్న అప్డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అయిపోయేది. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు? అంటూ ఫ్యాన్స్ గతంలోనూ నెట్టింట డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌ను ప్రశ్నించేవారు. గతంలో పలు సందర్భాల్లో 'కల్కి 2' వచ్చేందుకు చాలా టైం పడుతుందంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పగా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. సీక్వెల్‌కు సంబంధించి ఆల్రెడీ కొన్ని సీన్స్ చిత్రీకరణ చేసి రెడీగా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా... నిర్మాత అశ్వినీదత్ క్లారిటీ ఇవ్వడంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు.

వరుస ప్రాజెక్టులతో బిజీగా...

ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా మారారు. మారుతి డైరెక్షన్‌లో 'రాజా సాబ్'లో నటిస్తుండగా ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ కూడా లైనప్‌లో ఉంది. అలాగే... హను రాఘవపూడి 'ఫౌజీ' షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే... గతంలోనూ పలు సందర్భాల్లో 'కల్కి 2' పై అశ్వినీదత్ ప్రస్తావించారు. తాజాగా... సెప్టెంబరులో షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.