Rashmika About Vijay Deverakonda Post On Mysaa: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కొత్త మూవీ 'మైసా' అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నడూ లేని వారియర్ లుక్‌లో ఆమెను చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. నేషనల్ క్రష్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ పలువురు సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు.
విజయ్ పోస్ట్... క్యూట్ రిప్లై
యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా 'మైసా' పోస్టర్‌ను షేర్ చేస్తూ... 'ఇది అద్భుతంగా ఉండనుంది.' అంటూ స్టేటస్ పెట్టారు. దీన్ని రీషేర్ చేస్తూ రష్మిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది. 'విజ్జూ... ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా.' అని క్యాప్షన్ పెట్టి హార్ట్ ఎమోజీని జోడించారు.
విజయ్‌ను విజ్జూ అని పిలవడంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ గతంలోనూ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. వెకేషన్స్ ట్రిప్స్ జంటగా వెళ్లినట్లు ప్రచారం సాగింది. ఇటీవల 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ముంబై ఎయిర్ పోర్టులో ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించడంతో మరోసారి వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు తాజాగా మరోసారి 'విజ్జూ..' అంటూ క్యూట్‌గా పిలిచారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 సర్‌ప్రైజ్ వచ్చేసింది - కొత్త శత్రువుతో వార్ షురూ...
ఇక సినిమాల విషయానికొస్తే... వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక. ఆమె లేటెస్ట్ మూవీస్ 'కుబేర' బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. రీసెంట్ మూవీస్ యానిమల్, పుష్ప: ది రూల్, ఛావా దాదాపు రికార్డు కలెక్షన్స్ సాధించాయి. ప్రస్తుతం కుబేర సక్సెస్ జోష్‌లో ఉన్న రష్మిక తన కొత్త ప్రాజెక్టును శుక్రవారం ప్రకటించారు.
డిఫరెంట్ టైటిల్... సోలో వారియర్
ఇప్పటివరకూ ఎన్నడూ చేయని రోల్‌లో సోలో వారియర్‌గా ఆమె కొత్త మూవీలో కనిపించారు. చేతిలో ఆయుధం, ముక్కుపుడక, రక్తంతో కూడిన ముఖంతో గంభీరంగా కనిపించారు. ఈ లుక్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. 'ఇంతకుముందు ఎప్పుడూ పోషించని పాత్ర.. నేనెప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం. ఇప్పటివరకూ నేను కలవని నా మరో రూపం.' అంటూ పోస్టర్ షేర్ చేశారు.
ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తుండగా... రవీంద్ర పూలే దర్శకత్వం వహించనున్నారు. ఆయన ఈ మూవీతోనే డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాకు అజయ్, అనిల్ సయ్యపురెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ప్రస్తుతం రష్మిక ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో పాటే 'ది గర్ల్ ఫ్రెండ్', బాలీవుడ్ మూవీ 'థామా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' మూవీపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ కాగా జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.