Priyanka Chopra Recalls Dark Phase in Hollywood: గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటూ బాలీవుడ్‌, అటూ హాలీవుడ్‌లో స్టార్‌ నటిగా రాణిస్తుంది. బాలీవుడ్‌లో కెరీర్‌ పీక్‌లో ఉండగానే హాలీవుడ్‌ చెక్కేసింది. ప్రస్తుతం అక్కడ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్‌ అందుకుని బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక అమెరికన్‌ సింగర్‌ నీక్‌ జోనస్‌తో పెళ్లి తర్వాత లాస్‌ ఎంజెల్స్‌కు మకాం మార్చేసింది. ప్రస్తుతం హాలీవుడ్‌లోనే సెటిలైపోయిన ప్రియాంక అక్కడ కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనభవాలను పంచుకుంది. ప్రస్తుతం ప్రియాంక అక్కడ 'హెడ్స్ ఆఫ్ స్టేట్‌' మూవీతో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషనలో భాగంగా ఇంగ్లీష్‌ పాడ్‌కాస్ట్‌ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ చీకటి రోజులు చూశానంది.


బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన తనకు ఇక్కడికి వచ్చాక కెరీర్‌ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పింది. ఈమ మేరకు ఆమె మాట్లాడుతూ.. "ఇక్కడికి వచ్చాక నా కెరీర్‌ మళ్లీ మొదటికి వచ్చింది. మళ్లీ నటీగా కొత్తగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఇండస్ట్రీలో తెలిసిన వారు ఎవరు లేరు. స్నేహితులు, సన్నిహితులంటూ ఎవరూ లేరు. ఫోన్‌ చేసి పలకరించే వారు లేరు. ఒక్కసారిగా ఒంటరి దాన్ని అయిపోయాను. ఇక్కడ నాకు చాలా భయం వేసింది. ప్రారంభంలో ఆఫర్స్‌ కూడా రాలేదు. పైగా ఇంత పెద్ద న్యూయార్క్‌ నగరంలో ఒంటరిగా ఉండాను. ఇక్కడ కెరీర్‌ ప్రారంభంలో నేను చీకటి రోజులు చూశాను. అవి ఎలా గడిచాయో కూడా అర్థం కావడం లేదు. తలుకుంటుంటే ఒంట్లో వణుకు వచ్చేస్తోంది. ఏదేమైనప్పటికి ప్రారంభంలో ఈ న్యూయార్క్‌ నగరం చాలా భయంకరంగా అనిపించింది. అవి నాకు చీకటి రోజులు అని చెప్పాలి" అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. 


అనంతరం మాట్లాడుతూ.."కెరీర్‌ ప్రారంభంలో ఇక్కడ రిజెక్షన్స్‌ని కూడా వినయపూర్వకంగా తీసుకున్నాను. నేను ఓ పెద్ద స్టార్‌ అనే గర్వంగా చూపించలేదు. ఆ ఫీలింగ్‌నే నా నుంచి తీసేసుకున్నాను. సైలెంట్‌గా నా పని నేను చేసుకున్నాను. అదే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది" అని చెప్పింది. కాగా 2000లో సంవత్సరంలో ప్రియాకం చొప్రా మిస్‌ వరల్డ్ కీరిటం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె తమిళ చిత్రం తమిజన్‌తో సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ సరసన నటించింది. కోర్డురూం డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ప్రియాంకకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు.



ఆ తర్వాత సన్నీ డియోల్‌ 'ది హీరో: లవ్‌ స్టోరీ ఆప్‌ ఎ స్పై' చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఆమె అక్షయ్‌ కుమార్‌ అందాజ్‌లో నటించింది. ఈ చిత్రంతోనే ప్రియాంక ఓవర్ నైట్‌ స్టార్‌ అయిపోంది. అందాజ్‌తో ఒక్కసారిగా బి-టౌన్‌లో లైమ్‌లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత ప్రియాంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు, స్టార్‌ హీరోల సరసన నటిస్తూ అతి తక్కువ టైంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అదే క్రమంలో హాలీవుడ్‌లో ఆఫర్స్‌లో రావడంతో   అమెరికా వెళ్లింది. అదే సమయంలో నిక్‌ జోనస్‌తో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చకచక జరిగిపోయాయి. దీంతో లాస్‌ ఎంజెల్స్‌కు మాకాం మార్చిన ప్రియాంక ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ కీర్తి పొందింది. చెప్పాలంటే గ్లోబల్‌ స్టార్‌ బిరుదు అందుకు తొలి ఇండియన్‌ యాక్ట్రస్‌ ఆమె అనడంతో సందేహం లేదు. 


Also Read: హైట్ ముఖ్యం కాదట - కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన ఫరియా అబ్దుల్లా