Varalaxmi Sarathkumar : ఒకప్పుడు కలిసున్నాం, ఇప్పుడు విడిపోయాం.. ఇప్పుడది బోరింగ్ టాపిక్ - విశాల్‌తో లవ్ రూమర్స్‌పై వరలక్ష్మి క్లారిటీ

Varalaxmi Sarathkumar: ప్రస్తుతం దాదాపు ప్రతీ సౌత్ భాషా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్‌కుమార్‌కు మరోసారి విశాల్‌తో వచ్చిన రూమర్స్‌పై ప్రశ్న ఎదురయ్యింది. దానిపై ఆమె స్పష్టత ఇచ్చింది.

Continues below advertisement

Varalaxmi Sarathkumar About Vishal: వరలక్ష్మి శరత్‌కుమార్‌కు హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. ఇప్పుడు మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. విలన్‌గా నటించాలని తను తీసుకున్న నిర్ణయం.. తన కెరీర్‌నే మలుపు తిప్పింది. అంతే కాకుండా ఒక పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి వెనకాడదు వరలక్ష్మి. అలాంటి తను తాజాగా తన పెళ్లిపై, ఇంతకు ముందు విశాల్‌తో తనకు వచ్చిన రూమర్స్‌పై నోరువిప్పింది. అంతే కాకుండా మరెన్నో పర్సనల్ లైఫ్ విశేషాలను పంచుకుంది.

Continues below advertisement

అదంతా ఒకప్పుడు..

తనపై ఎక్కువగా రూమర్స్ లాంటివి రాలేదని, విశాల్‌తో వచ్చింది కూడా రూమర్స్ కాదని క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఒకప్పుడు తాము కలిసున్నామని, ఇప్పుడు విడిపోయామని బయటపెట్టింది. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్లది అని స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం వరలక్ష్మి ఎక్కడికి వెళ్లినా తన పెళ్లి గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా మరోసారి ఆ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది. పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని కానీ ఇంకా కొన్ని పనులు ఉండడంతో ఇప్పుడే డేట్ అనౌన్స్ చేయడం లేదని తెలిపింది. పెళ్లి ఎక్కడ జరుగుతుంది అని అడగగా.. ప్రస్తుతం తన పనిలోనే బిజీగా ఉన్నానని, అది జరిగేటప్పుడు జరుగుతుందని సింపుల్‌గా చెప్పేసింది. తన తండ్రి శరత్‌కుమార్ కూడా తన పెళ్లి విషయంలో సంతోషంగా ఉన్నారని చెప్పింది. 

అతడిపై కేసు పెట్టాను..

ఒకప్పుడు ఇండస్ట్రీ అనేది వేరేలా ఉండేది కాబట్టి ఇందులో గెలవడం కష్టమనే ఉద్దేశ్యంతో వరలక్ష్మిని హీరోయిన్ అవ్వకుండా ఆపారట శరత్‌కుమార్. ఈ విషయం తనే స్వయంగా బయటపెట్టింది. ఒక తండ్రిగా ప్రేమతోనే ఆయన అలా చేశారని తెలిపింది. తన తండ్రి భయపడినట్టుగానే ఇండస్ట్రీలో కొన్ని ఘటనలు జరుగుతున్నాయని, కానీ దానిని మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్నది ముఖ్యమని తన అభిప్రాయం వ్యక్తం చేసింది వరలక్ష్మి. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ‘‘ఒక పెద్ద ఛానెల్ హెడ్ ఇంటర్వ్యూ కోసం ఇంటికి వచ్చారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రూమ్ బుక్ చేస్తాను రమ్మన్నారు. నేను ఒక పెద్ద హీరో కూతురిని అయినా నాతోనే ఇలా మాట్లాడుతున్నాడు. వేరే వాళ్ల పరిస్థితి ఏంటి అని తనపై కేసు పెట్టాను. అప్పుడే అమ్మాయిల రక్షణ కోసం ఎన్‌జీవోను ప్రారంభించాను’’ అని చెప్పుకొచ్చింది.

బాలకృష్ణపై అభిప్రాయం మారిపోయింది..

రాధికతో తన బాండింగ్ గురించి చెప్తూ వాళ్లెప్పుడూ చిల్ ఉంటారని తెలిపింది వరలక్ష్మి శరత్‌కుమార్. ఇక తన తండ్రి శరత్‌కుమార్.. రాజకీయాల్లో యాక్టివ్ అవుతుండగా.. భవిష్యత్తులో తను కూడా రాజకీయాల్లో వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. వెళ్లొచ్చు, వెళ్లకపోవచ్చు అని సమాధానమిచ్చింది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ యాక్టింగ్‌పైనే ఉన్నా.. భవిష్యత్తులో డైరెక్షన్‌లో కూడా అడుగుపెట్టే ఛాన్స్ ఉందని మనసులో మాటను బయటపెట్టింది. ‘వీరసింహారెడ్డి’లో బాలక‌ృష్ణతో కలిసి నటించిన అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ‘‘బాలకృష్ణను కలవక ముందు వేరే అభిప్రాయం ఉండేది. కలిసిన తర్వాత మొత్తం మారిపోయింది. ఆయనకు అస్సలు ఇన్‌సెక్యూరిటీ అనేది లేదు. అందరినీ చాలా ప్రోత్సహిస్తారు. రవితేజ కూడా చాలా చిల్ పర్సన్’’ అని తన కో యాక్టర్స్ గురించి చెప్పుకొచ్చింది వరలక్ష్మి.

Also Read: మేకప్ రూమ్‌లో బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు, నాకు న్యాయం కావాలి - సీరియల్ నటి ఆవేదన

Continues below advertisement