Prithviraj Sukumaran As Kumbha Role In Rajamouli SSMB29 Movie : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB29' నుంచి సడన్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తోన్న ఈ మూవీలో విలన్ రోల్ ఇంట్రడ్యూస్ చేస్తూ జక్కన్న బిగ్ ట్రీట్ ఇచ్చారు.
'కుంభ'గా పృథ్వీరాజ్
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'SSMB29' 'కుంభ' అనే రోల్‌లో కనిపించనున్నారు. రోబోటిక్ హ్యాండ్స్ కలిగిన వీల్ చైర్‌లో అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా ఆయన ఓ పవర్ ఫుల్ లుక్‌లో అదరగొట్టారు. బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఈ లుక్ ఓ యాక్షన్ సీక్వెన్స్‌లోనిదిగా తెలుస్తోంది. క్లైమాక్స్‌లో ఓ భారీ ఫైట్ సీన్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది.
లుక్ ఇంట్రడ్యూస్ చేస్తూనే... రాజమౌళి రాసిన డిస్క్రిప్షన్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 'పృథ్వీతో ఫస్ట్ షాట్ షూట్ చేసిన తర్వాత నేను అతని దగ్గరకు వెళ్లి... నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో నువ్వు ఒకరని చెప్పా. ఈ క్రూరమైన శక్తిమంతమైన విలన్ కుంభకు ప్రాణం పోయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంంగా ఉంది.' అంటూ రాసుకొచ్చారు.
రాజమౌళి సార్... మీ ప్లానేంటి?
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అఫీషియల్‌గా ప్రీ లుక్ వచ్చినా... పూర్తి స్థాయిలో వచ్చిన ఫస్ట్ లుక్ ఇదే కావడం విశేషం. అసలు 'కుంభ' ఎవరు? అనే సస్పెన్స్ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ ప్రయాణం ఈ మూవీ అని ముందు నుంచీ టాక్ వినిపిస్తోంది. మరోవైపు, మైథలాజికల్ టచ్ కూడా ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్‌లో 'వారణాసి' సెట్ వేసినట్లు తెలుస్తోంది. టైటిల్ కూడా అదే ఫిక్స్ చేస్తారని ప్రచారం సాగుతోంది.
మరి ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్‌లో మైథలాజికల్ టచ్ 'సంజీవని' అన్వేషణ కథాంశంతో ఉన్న స్టోరీలో విలన్ రోల్ ఓ రోబోటిక్ వీల్ చైర్‌లో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డివోషనల్, అడ్వెంచర్ మూవీకి సైంటిఫిక్ ఫిక్షన్ టచ్ ఇస్తున్నారా? రాజమౌళి... అంటూ సినీ విశ్లేషకులతో పాటు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా గమనిస్తే... ఆ లుక్ వెనుక ఆఫ్రికన్ వాటర్ ట్రీస్ మనకు కనిపిస్తాయి. అక్కడ ఉండే బెస్ట్ లొకేషన్‌లో ఈ సీన్ షూట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read : SSMB29 నుంచి సడన్ సర్‌ప్రైజ్ - ఎవరూ ఊహించని క్రూరమైన 'కుంభ'... పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ వేరే లెవల్
అప్పుడే కంపేరిజన్స్
'కుంభ'లో పృథ్వీరాజ్ లుక్ అదిరిపోయినా... అప్పుడే సోషల్ మీడియాలో కంపేరిజన్స్ మొదలయ్యాయి. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను చూసినట్లుగా ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే... ఈ లుక్ చూస్తుంటే 'స్పైడర్ మ్యాన్' మూవీలో విలన్ రోల్ డాక్టర్ ఒట్టో ఆక్టేవియస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అలాగే, తమిళ స్టార్ సూర్య మూవీలో విలన్ రోల్ ఆత్రేయను పోలి ఉన్నారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'క్రిష్ 3' మూవీలో విలన్ కాల్‌ను చూసినట్లు ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ విలన్ లుక్‌తోనే యూవత్ సినీ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు రాజమౌళి. ప్రీ లుక్‌తోనే ఎన్నో ప్రశ్నలను క్రియేట్ చేసిన రాజమౌళి... విలన్ 'కుంభ' లుక్‌తో ఆ ప్రశ్నలను పదింతలు చేశారు. దీన్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు... 'నేను అవతలి వైపు ఉన్నాను. ఈ కుంభతో నేరుగా కలిసే సమయం ఆసన్నమైంది.' అంటూ రాసుకొచ్చారు. మరి ఈ విజువల్ వండర్‌ను చూడాలంటే 2027 వరకూ వెయిట్ చేయాల్సిందే.