Ram Charan Chikiri Chikiri Hook Step Trending Now : హుక్ స్టెప్స్... ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటివరకూ సాంగ్స్‌, వెరైటీ డ్యాన్స్ ట్రెండ్ సృష్టిస్తూనే ఉన్నాయి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మెగాస్టార్ చిరంజీవి అంటేనే డ్యాన్స్‌కు మరోపేరుగా చెబుతుంటారు. అప్పటి 'హిట్లర్' నుంచి మిడిల్‌లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ మూవీస్‌లో హుక్ స్టెప్స్... ఇక రీసెంట్‌గా 'మన శంకరవరప్రసాద్ గారు'లో 'మీసాల పిల్ల' అంటూ వేసిన హుక్ స్టెప్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ దూసుకెళ్తున్నారు.

Continues below advertisement

డ్యాన్స్‌లో తనదైన ట్రెండ్ సృష్టిస్తూ హుక్ స్టెప్స్‌తో అదరగొడుతున్నారు. తాజాగా వచ్చిన పెద్ది 'చికిరి చికిరి' సాంగ్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. కొండల్లో పక్కా మాస్ లుక్‌లో చికిరి చికిరి అంటూ ఆయన వేసిన హుక్ స్టెప్ వేరే లెవల్‌లో ఉంది.

సిగ్నేచర్ షాట్ విత్ హుక్ స్టెప్

Continues below advertisement

ముఖ్యంగా 'చికిరి చికిరి' సాంగ్ సాధారణ ఫ్యాంట్ షర్ట్ వేసిన చరణ్... హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ ముద్దుగా చికిరి అని పిలుచుకుంటూ వేసిన హుక్ స్టెప్ నిజంగా వేరే లెవల్. కొండల్లో నోట్లో బీడీతో... 'ఆ చంద్రుల్లో ముక్క. జారిందే నీ నక్క. నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా.. నా చికిరి చికిరి' అంటూ బ్యాట్ పట్టుకుని సిగ్నేచర్ షాట్‌తో వేసిన హుక్ స్టెప్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చరణ్ ముందుకు వచ్చి బ్యాట్‌ను భూమికి బాది భారీ షాట్ కొట్టిన ఫ్రేమ్ ట్రెండ్ అవుతుండగా... ఇప్పుడు అదే సిగ్నేచర్ షాట్‌తో వేసిన హుక్ స్టెప్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఈ పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా... బాలాజీ లిరిక్స్ అందించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... మోహిత్ చౌహాన్ పాడారు. సినిమాలో అచ్చియమ్మ పాత్రలో మాసీ లు‌క్‌లో నయా అందాల తార జాన్వీ కపూర్ కనిపించనున్నారు. ఇప్పటికే ఆమె మాసీ లుక్ వైరల్ అవుతోంది. తన కలల 'చికిరి' కోసం మన 'పెద్ది'గాడి స్టెప్పులు, గ్రేస్, జోష్ అదిరిపోయాయి. ఈ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఫుల్ ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. సాంగ్ రిలీజైన కొద్దిసేపటికే సూపర్ ఫాస్ట్‌గా ట్రెండ్ అవుతోంది. 

Also Read : నేచరల్ థ్రిల్లర్ 'జటాధర' ఓటీటీ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

'పెద్ది'కి ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వం వహించగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ స్పోర్ట్ నేపథ్యం, ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌తో మూవీ రూపొందుతోంది.