Ram Charan's Chikiri Chikiri Song From Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ 'పెద్ది' నుంచి నుంచి బిగ్ ట్రీట్ వచ్చేసింది. 'చికిరి చికిరి' అంటూ గత రెండు రోజులుగా ఊరించిన పాట ఫుల్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీం. గ్లింప్స్‌లో 'పెద్ది పెద్ది' అంటూ సిగ్నేచర్ షాట్ వేరే లెవల్‌లో ఉండగా 'చికిరి' దాన్ని మించేలా ట్రెండ్ సెట్ చేయనుంది.

Continues below advertisement


చరణ్, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్‌పై ఈ సాంగ్ కంపోజ్ చేయగా గతం కంటే డిఫరెంట్ లిరికల్ వీడియో కాకుండా ఫుల్ వీడియో సాంగ్‌నే రిలీజ్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. గ్లింప్స్ తర్వాత లుక్స్ తప్ప ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో నిరాశ చెందిన ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అందించేలా వీడియోనే రిలీజ్ చేయడంతో ఖుష్ అవుతున్నారు.


చికిరి చికిరి... హుక్ స్టెప్ అదుర్స్


కొండలో ఉన్న 'పెద్ది' ఫస్ట్ టైం తన కలల రాణి తన 'చికిరి'ని చూస్తూ ఆమెను ఊహించుకుంటూ వేసిన హుక్ స్టెప్ అదిరిపోయింది. 'ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా...' అంటూ సాగే లిరిక్స్ హుషారెత్తిస్తున్నాయి. అదిరిపోయే కాస్ట్యూమ్స్ లేవు... సాధారణ ఫ్యాంట్, షర్ట్ వేసుకున్న మన 'పెద్ది'... మెడలో కర్చీఫ్ కట్టి బీడీ కాలుస్తూ కొండ అంచున నిలబడి... 'చికిరి చికిరి' అంటూ వేసిన హుక్ స్టెప్ వేరే లెవల్‌లో ఉంది. గతంలో 'హిట్లర్' మూవీ మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్, అలానే RRRలో నాటు నాటు అంటూ వేసిన హుక్ స్టెప్‌లానే ఇది కూడా మరో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.



ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉంది. 'కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కు పుడక అక్కర్లేని ముక్కు... అలంకరణ అక్కర్లేని అరుదైన నా చికిరి' అనే అర్థం వచ్చేలా సాగిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను మోహిత్ చౌహాన్ పాడారు. 


Also Read : మీ వెయిట్ ఎంత? - జర్నలిస్ట్ ప్రశ్నకు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్... సింగర్ చిన్మయి అమేజింగ్ రియాక్షన్


మూవీలో రామ్ చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ గ్రామీణ స్పోర్ట్స్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వేరే లెవల్‌లో ఉంది. ముఖ్యంగా అందులో చరణ్ సిగ్నేచర్ షాట్ ట్రెండ్ అవుతోంది. చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.