Preity Zinta: ఏడేళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపైకి ప్రీతి జింతా - ఆ మూవీతో రీఎంట్రీకి సిద్ధమవుతోన్న సొట్ట బుగ్గల సుందరి

Preity Zinta: సొట్ట బుగ్గ‌ల చిన్న‌ది అన‌గానే గుర్తొచ్చే పేరు ప్రీతి జింతా. ఎంతోమంది అభిమానుల మ‌న‌సు దోచింది ఈమె. ఇప్పుడు ఏడేళ్ల త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్ పై మెర‌వ‌నున్నారు.

Continues below advertisement

Preity Zinta entry After 7 Years: సొట్ట బుగ్గ‌ల చిన్న‌ది అన‌గానే గుర్తొచ్చే పేరు ప్రీతి జింతా. ఎంతోమంది కుర్ర‌కారు మ‌న‌సు దోచింది ఈమె. ఎన్నో హిట్ సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది ఈ సొట్ట బుగ్గ‌ల చిన్న‌ది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజ్ ల‌తో బిజీగా ఉంది. అయితే, చాలాఏళ్లు గ్యాప్ తీసుకున్న త‌ర్వాత‌.. ఇప్పుడు మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్ పై మెర‌వ‌నుంది ప్రీతి. దానికి సంబంధించి ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

Continues below advertisement

స‌న్నిడియోల్ తో క‌లిసి.. 

ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్ పై క‌నిపించ‌నున్నారు ప్రీతి జింతా. స‌న్నీ డియోల్ తో క‌లిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 'లాహోర్ 1947' సినిమాలో ఆమె న‌టించ‌నున్నారు. ఈవిష‌యాన్ని ప్రీతి స్వ‌యంగా తెలియ‌జేశారు. షూట్ కి సంబంధించి కొన్ని ఫొటోల‌ను ఆమె ఇన్ స్టా లో షేర్ చేశారు. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ సినిమాకి సంబంధించి క్లాప్ బోర్డ్ ను షేర్ చేశారు ఆమె. ఆ క్లాప్ బోర్డ్ లో సినిమా పేరు, డైరెక్ట‌ర్ పేరు, అమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ త‌దిత‌ర వివ‌రాలు రాశారు. డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్రఫీ సంతోష్ శివ‌న్‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను కూడా షేర్ చేశారు ప్రీతి జింతా. "ఆన్ సెట్ ఆఫ్.. లాహోర్ 1947 న్యూ మూవీ" అని రాసుకొచ్చారు ప్రీతి. 

థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్.. 

ప్రీతి జింతాకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌. ఆమె సొట్ట బుగ్గ‌ల‌కి ముఖ్యంగా. ఇక ఏడేళ్ల త‌ర్వాత త‌మ అభిమాన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని తెలియ‌డంతో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. "వెల్ క‌మ్ బ్యాక్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "రాణి ముఖ‌ర్జీ, ప్రీతి ఎరా మ‌ళ్లీ తిరిగి వ‌స్తుంది" అంటూ తెగ ఆనందప‌డుతున్నారు. ప్రీతి జింత‌, స‌న్నీ డియోల్ కాంబినేష‌న్ లో కూడా గ‌తంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. 'హీరో', 'ఫ‌ర్జీ', 'భ‌య్యాజీ' లాంటి సినిమాల్లో న‌టించారు. ఇక అవి సూప‌ర్ హిట్ గా నిలిచాయి. 'లాహోర్ 1947'లో మ‌ళ్లీ జ‌త క‌ట్ట‌నున్నారు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. రాజ్ కుమార్ సంతోషి డైరెక్ట‌ర్. ష‌బానా అజ్మీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడ్యూస‌ర్. 

పెళ్లి త‌ర్వాత గ్యాప్.. 

ప్రీతి జింతా బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్. ఆమె తెలుగులో న‌టించిన రెండు సినిమాలు సూప‌ర్ హిట్ కావ‌డంతో ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు ఆమెకి. ఇక ఆ త‌ర్వాత బాలీవుడ్ కే ప‌రిమితం అయ్యారు ప్రీతి. ఇక 2016లో అమెరికన్ అయిన జీన్ గుడెనఫ్‌ని లాస్ ఏంజలస్‌లో పెళ్లి చేసుకుంది. అప్పట్నించి భర్తతో పాటూ అక్కడే సెటిలైంది. సినిమాలకు కూడా దూరంగా ఉంటోంది.

Also Read: కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ రణ్‌వీర్ వ్యాఖ్యలు - అది డీప్ ఫేక్ వీడియో అంటూ పోలీసులను ఆశ్రయించిన బాలీవుడ్ హీరో

Continues below advertisement