Aparna Das Weds Deepak Parambol: మలయాళంలోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఇందులో పూర్తిగా 11 మంది నటులు ఉండగా.. అందులో ప్రతీ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు. అంతమంది నటుల్లో దీపక్ పరంబోల్ కూడా ఒకడు. దీపక్.. ఇప్పటివరకు ఎన్నో మలయాళ సినిమాల్లో నటించాడు కానీ ‘మంజుమ్మెల్ బాయ్స్’తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈ హీరో.. తన కో యాక్టర్ అపర్ణా దాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అపర్ణ దాస్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.


మొదటి సినిమా నటుడితోనే..


మలయాళ సినిమా 'మనోహరం'తో అపర్ణా దాస్ కథానాయికగా పరిచయం అయ్యారు. అదే సినిమాలో దీపక్ పరంబోల్ కూడా ఒక చిన్న పాత్రలో కనిపించాడు. అప్పటివరకు అపర్ణా దాస్ ఎవరో ప్రేక్షకులకు తెలియదు. కానీ విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’ ద్వారా ఆమెకు మొదటిసారి తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది. అందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించినా కూడా చాలామంది ఆడియన్స్.. అపర్ణా దాసే బాగుంది అంటూ కామెంట్స్ కూడా చేశారు. అలా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకుంది అపర్ణా దాస్. ఇక తాజాగా తన మొదటి సినిమాలో కలిసి నటించిన నటుడినే వివాహం చేసుకుంది.


కేరళ సాంప్రదాయం..


తాజాగా అపర్ణా దాస్, దీపక్ పరంబోల్ పెళ్లి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. హల్దీకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను వీరిద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వారిద్దరూ బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ.. చాలా సంతోషంగా కనిపించారు. పెళ్లి వేడుకలు మొదలయినప్పటి నుండి వీరు షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మొదలయ్యింది. ఆ ఫోటోలలో వీరిద్దరూ చాలా క్యూట్ ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా ఆ ఫోటోలలో వీరి పెళ్లి ఫోటో కూడా యాడ్ అయ్యింది. పెళ్లి ఫోటోలలో వీరిద్దరూ కేరళ సాంప్రదాయం ప్రకారం బట్టలు వేసుకొని చాలా అందంగా ఉన్నారని అందరూ తమ మ్యారేజ్ లైఫ్ బాగుండాలని విషెస్ చెప్తున్నారు. అపర్ణ తెలుగులో ‘ఆదికేశవ’ మూవీలో నటించింది.






ఎవరూ నమ్మలేరు..


అపర్ణా దాస్, దీపక్ పరంబోల్.. వారి మొదటి సినిమా నుండే రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా దాని గురించి ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. అందుకే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్, పెళ్లి గురించి వార్తలు వైరల్ అయినప్పుడు కూడా ఎవరూ నమ్మలేదు. స్వయంగా వారే తమ పెళ్లి ఇన్విటేషన్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినా కూడా ఏదయినా మూవీ ప్రమోషన్ ఏమో అనుకొని చాలామంది పట్టించుకోలేదు. ఫైనల్‌గా వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకొని అందరినీ షాక్‌కు గురిచేశారు. ‘మంజుమ్మెల్ బాయ్స్’కు ముందు దీపక్ పరంబోల్‌ ఎప్పుడూ హీరోగా నటించలేదు. మొదటిసారి హీరోగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడంతో పాటు తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు ఈ నటుడు.



Also Read: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ