Republic Movie: ప్రి రిలీజ్ వేడుకకు అంతా సిద్ధం.. ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్, మెగా హీరోల రాక?

యాక్సిడెంటుకు గురై ఆసుపత్రిలో ఉన్న సాయిధరమ్ తేజ్ మూవీ రిపబ్లిక్ అక్టోబర్ 1 న విడుదల కానుంది.

Continues below advertisement

సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్’. ఆ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరు లాంఛ్ చేశారు. ట్రైలర్ కు వచ్చిన స్పందన మామూలుగా లేదు. హిట్ కొట్టటం ఖాయమేనన్న సంకేతాలు వచ్చాయి. డైరెక్టర్ దేవకట్టా టేకింగ్, పవర్ ఫుల్ డైలాగులు యువతకు నచ్చేశాయి. ఈ సినిమాను ముందుగా అనుకున్నట్టే చిత్ర యూనిట్ అక్టోబర్ 1న విడుదల చేస్తోంది. ప్రి రిలీజ్ వేడుకను శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జెఆర్సి కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాలు మెగా అభిమానులతో నిండిపోయాయి. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రాబోతున్నారని ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

Continues below advertisement

సాయిధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. అప్పట్నించి అతడికి మద్దతుగా నిలుస్తోంది మెగా ఫ్యామిలీ. అతడి లేని లోటు తెలియకుండా ఉండాలంటే మెగా హీరోలంతా ప్రి రిలీజ్ ఈవెంట్ వెళ్లాలని అనుకుంటున్నారట. సాయిధరమ్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. రమ్యకృష్ణ, జగపతి బాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సోషల్ డ్రామాగా సాగే ఈ సినిమాను మొదట ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారట మేకర్స్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం, కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలవ్వడం చూశాక సినిమా హాల్లోనే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తొలిసారి తేజు ఇందులో కలెక్టర్ గా నటిస్తున్నాడు. ట్రైలర్ ను బట్టి రమ్యకృష్ణ, జగపతి బాబులను దీటుగానే ఢీ కొట్టినట్టు కనిపిస్తోంది. ఐశ్వర్యా రాజేష్ పాత్ర నేపథ్యం గురించి వివరాలు బయటికి రాలేదు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: ‘వరుడు కావలెను’ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే...
Also read: లిక్విడ్ లడ్డూ ఎలా చేయాలంటే.. సెలెబ్రిటీ చెఫ్ సరాంశ్ ఇన్ స్టా పోస్టు వైరల్
Also read: సగ్గు బియ్యంతో బరువు తగ్గే ఛాన్స్.. అదొక్కటే కాదు మరెన్నో ప్రయోజనాలు

Continues below advertisement