నాగశౌర్య- రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కతున్న సినిమా ‘వరుడు కావలెను’. ఇప్పటికే ఈ సినిమా పాటలు, టీజర్లు విడుదలై మంచి టాక్ సంపాదించుకున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటూ కుర్రకారుకు నచ్చే ఎలిమెంట్స్ ను అన్నీ ఉన్నట్టే అర్థమవుతుంది. కాకపోతే థియేటర్లలో విడుదల చేయాలా వద్దా? కుటుంబ ప్రేక్షకులు వస్తారా రారా? అనే సందేహం మేకర్స్ లో ఉండిపోయింది. అయితే లవ్ స్టోరీ సినిమా విడుదలై మంచి టాక్ సంపాదించుకోవడం, ప్రేక్షకులు కూడా థియేటర్ కి రావడంతో వారిలో తమ సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు.  వరుడు కావలెను  సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఆ రోజే దసరా పండుగ కూడా. ప్రేమ, వినోదం, ఎమోషన్... మూడు కలగలిసిన పవర్ ప్యాక్ గా వరుడు కావలెను సినిమా ప్రేక్షకులను అలరిస్తుందంటున్నారు మేకర్స్. 


టీజర్స్, ఫోటోలు చూసిన వారికి సినిమాకు కలర్ ఫుల్ విజువల్స్ తో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. దాదాపు 14 కోట్ల రూపాయలను సినిమా కోసం ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత అందించగా, నిర్మాతగా నాగవంశీ సూర్యదేవర వ్యవహరించారు. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా చేసిన తొలిసినిమా ఇది. నదియా, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


నానీతో రీతూ కలిసి చేసిన టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఇప్పుడిప్పుడు రీతూ అవకాశాలు దక్కించుకుంటూ హీరోయిన్ గా ఎదుగుతోంది. నాగశౌర్య కూడా తన నటనతో ప్రేక్షకుల్లో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: శారీ క్వీన్ శిల్పాశెట్టి.. చీరకే అందం తెచ్చిన సాగరకన్య


Also read: లిక్విడ్ లడ్డూ ఎలా చేయాలంటే.. సెలెబ్రిటీ చెఫ్ సరాంశ్ ఇన్ స్టా పోస్టు వైరల్


Also read: జపాన్ వారి సోబా నూడిల్స్ ట్రై చేశారా... ఎంత రుచో, అంత ఆరోగ్యం కూడా