Prasanth Varma about HanuMan: 2024 సంక్రాంతి చాలా గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. జనవరి 12న ‘హనుమాన్’ మూవీ విడుదలకు సిద్ధమయినా.. దానికి ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. అప్పటినుండే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. ఇక దానికి పోటీగా విడుదలయిన ‘గుంటూరు కారం’ యావరేజ్ అనే టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులంతా ఇప్పుడు ‘హనుమాన్’నే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ప్రశాంత్ వర్మ ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అలా ఒక ఇంటర్వ్యూలో సైకిల్‌తో గుద్దితే కారుకు సొట్ట పడుతుందేమో అని తను ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రేక్షకులు ఇప్పుడు నమ్ముతున్నారు.


సైకిల్‌తో గుద్దితే కారుకు సొట్ట..
‘హనుమాన్’ రిలీజ్‌కు ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో సినిమాను ఎందుకు ఒక గట్టి పోటీ మధ్య పడేస్తున్నారు అని ప్రశ్న ఎదురయ్యింది. ‘‘మేము పడేయలేదు. మేము అక్కడే ఉన్నాం. వేరేవాళ్లు వచ్చి జాయిన్ అయిపోయారు పోటీలో’’ అని క్లారిటీ ఇచ్చాడు. దానికి కౌంటర్‌గా ‘‘ఒక కుర్రాడు సైకిల్ మీద వస్తున్నప్పుడు ఎదురుగా నాలుగు కార్లు వస్తే తప్పుకోవాలి’’ అని ‘హనుమాన్’.. ఇతర సినిమాలతో పోటీకి సిద్ధమయిన తీరును పోల్చి చెప్పారు జర్నలిస్ట్. ‘‘మీరు చెప్పిన ఉదాహరణ కరెక్టే. కానీ సైకిల్ పవర్ కారుకంటే ఎక్కువగా ఉండొచ్చు కదా. ఆ సైకిల్‌తో గుద్దితే కారుకు కూడా సొట్ట పడొచ్చు’’ అంటూ తన సినిమాపై నమ్మకం వ్యక్తం చేశాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు నిజంగానే సైకిల్‌తో గుద్దితే కారుకు సొట్ట పడిందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.


సినీ పరిశ్రమకు రావడమే రిస్క్..
ఇక ‘హనుమాన్’ విషయంలో తాము తీసుకుంటున్న రిస్క్ గురించి మాట్లాడుతూ.. ‘‘రిస్క్ లేనిదే రివార్డ్ లేదు. అసలు సినిమా ఇండస్ట్రీకి నేను రావాల్సిన అవసరం లేదు. చాలా చదువుకున్నాను. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. కానీ సినీ పరిశ్రమకు రావడమే పెద్ద రిస్క్ నా జీవితంలో. దాని తర్వాత నేను ప్రయత్నించిన జోనర్స్, సినిమాలు కూడా అన్నీ రిస్కే. సేఫ్ ప్లే ఎప్పుడూ ఆడలేదు. రిస్క్ చేయకపోవడమే పెద్ద రిస్క్. ముఖ్యంగా ఈ పాయింట్‌లో సినీ పరిశ్రమలో సేఫ్ గేమ్ ఎప్పుడు ఆడతామో అప్పుడు దొరికేస్తాం. ఎంత ఎక్కువ రిస్క్ చేస్తే అంత ఎక్కువ రివార్డ్’’ అంటూ రిస్క్ తీసుకోవడంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.


తేజ నెగిటివ్‌గా ఉంటాడు..
సంక్రాంతి పోటీ గురించి మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతికి మామూలుగా మూడు సినిమాలు ఆడతాయి. మేము ఆ టాప్ 3లో ఉంటే సరిపోతుంది. నేను చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తాను. తేజతో కూడా అంటూ ఉంటాను. తను ఎక్కువగా నెగిటివ్‌గా ఉంటాడు. కొంచెం టెన్షన్‌లో ఉన్నాడు. ఎలా వెళ్తుందో చూద్దామని నేను అంటాను. నిర్మాత నాకంటే ఎక్కువ నమ్ముతున్నారు సినిమాను. హిందీ డిస్ట్రిబ్యూటర్లు 2, 3 నెలల ముందే సినిమా చూశారు. వాళ్లు మాకంటే ఎక్కువ నమ్ముతున్నారు సినిమాను. ఇంత రేంజ్‌కు వెళ్తుంది అని మేము అనుకుంటే దానికంటే పది రెట్లు ఎక్కువ నమ్మారు. మాకంటే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. ఈ సినిమా థియేటర్ల‌లో చూసే ఎక్స్‌పీరియన్సే బాగుంటుంది’’ అని నమ్మకంతో ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలను ఇప్పుడు ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. 


Also Read: బిగ్ బాస్‌లో శివ్ చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ఇక ప్రియాంకకు దూరంగా ప్రియుడు, కారణం ఇదే