ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్‌ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్సన్‌ నుంచి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. రూ.40 కోట్లతో రూపొందించిన ఈ సినిమా మొత్తం థియేట్రికల్‌ రన్‌లో సుమారు రూ. 300 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఈ మూవీతో ఒక్కసారిగా ప్రశాంత్‌ వర్మ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. తక్కువ బడ్జెట్‌లోనే విజువల్‌ వండర్‌ చూపించిన ప్రశాంత్‌ వర్మ పనితనాన్ని సాధారణ ఆడియన్స్‌ మాత్రమే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు కొనియాడారు.


సూపర్‌ హీరో జానర్‌కు 'హనుమాన్‌' అంటూ ఇతిహాసాలను జోడించి తెలుగు ఆడియన్స్‌కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చాడు, అంతటి భారీ విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లో మూవీ చివరిలో 'జై హనుమాన్‌' సీక్వెల్‌ టైటిల్‌ను కూడా ప్రకటించాడు ప్రశాంత్‌ వర్మ. అయితే హనుమాన్‌లో హనుమంతుడి పాత్రను పూర్తిగా రివిల్‌ చేయకుండ సీక్వెల్‌పై మరింత క్యూరియాసిటీ పెంచాడు. సెకండ్‌ పార్ట్‌ మొత్తం రాముడికి మానుమంతుడు‌ ఇచ్చిన మాట నేపథ్యంలోనే సాగనుందని ఫస్ట్‌ పార్ట్‌తో క్లారిటీ వచ్చేసింది. దీంతో సీక్వెల్‌లో పవర్ఫుల్‌ రోల్‌ అయినా హనుమాన్‌ పాత్రలో కనిపించేది హీరో ఎవరనేది ఇప్పడు సస్పెన్స్‌ నెలకొంది. ఈ క్రమంలో హనుమాన్‌ పాత్ర తరచూ చర్చనీయాంశం అవుతుంది.






హనుమాన్‌గా రానా దగ్గుబాటి నటించనున్నాడని, కాదు మెగా హీరో రామ్‌ చరణ్‌ నటిస్తారంటూ తరచూ ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా హనుమాన్‌ మూవీ నిర్మాత సీక్వెల్‌లో హనుమాన్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారో సైలెంట్‌గా హింట్‌ ఇచ్చారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించారు 'హనుమాన్‌' నిర్మాత చైతన్య. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. జై హనుమాన్‌లో హనుమాన్ పాత్ర నాకు రామ్ చరణ్‌ చేయాలని ఉంది. లేదంటే చిరంజీవి గారు. వారిలో ఎవరూ చేసిన బాగుంటుందని నా అభిప్రాయం. ఇది కేవలం నా పర్సనల్‌ అభిప్రాయం మాత్రమే. దీనికి కథకి, డైరెక్షన్‌కి ఏం సంబంధం లేదు" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 






Also Read: 'కల్కి 2898 AD' మూవీపై మహేష్‌ బాబు లేట్‌ రివ్యూ - ప్రతి ఫ్రేం కళాఖండం, నాగ్‌ అశ్విన్‌ రిప్లై చూశారా?