Mahesh Babu Review on Kalki 2898 AD: కల్కి 2898 AD మూవీపై మహేష్‌ బాబు లేటుగా రివ్యూ ఇచ్చారు. రీసెంట్‌గా ఈ సినిమా చూసిన ఆయన డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌, మూవీ నటీనటుల పర్పామెన్స్‌ని కొనియాడారు. కల్కి 2898 AD ఒక అద్భుతమని, ప్రతి ఫ్రేం ఓ కళాఖండం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక కల్కి 2898 AD సీక్వెల్‌లో మహేష్‌ క్రష్ణుడి పాత్రలో కనిపించనున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో మహేష్‌ మూవీపై గురించి ట్వీట్‌ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. లేటుగా ఈ సినిమా చూసిన 'కల్కి 2898 ఏడీ' మూవీపై ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్‌లు చేశారు. 


ఇప్పటికే కల్కి 2898 ఏడీ చిత్రంలో డైరెక్టర్‌ రాజమౌళి, మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ఒక అద్భుతమైన, నాగ్‌ అశ్విన్‌ అద్భుతం చేశాడంటున్నారు. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇక తాజాగా మహేష్‌ బాబు సైతం డైరెక్టర నాగ్‌ అశ్విన్‌ విజన్‌ని కొనియాడారు. "కల్కి 2898.. నా మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఇదోక అద్భుతం. నాగ్‌ అశ్విన మీ భవిష్యత్ దృష్టికి హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.






అలాగే కల్కి ప్రధాన పాత్రలపై కూడా ప్రశంసలు కురిపించారు. "అమితాబ్ బ‌చ్చన్ సర్‌ మీ అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్‌ని ఇంకెవరూ పోల్చలేరు. క‌మ‌ల్ హాస‌న్ ఏ పాత్ర పోషించినా దానికంటూ ఒక ప్రత్యేక‌తను తీసుకొస్తారు. ప్రభాస్‌ మరోసారి ఓ గొప్ప పాత్రను చాలా సులభంగా చేశారు. ఇక దీపికా ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ఇంతటి భారీ విజయాన్ని సాధించిన వైజయంతీ సంస్థ్‌, కల్కి టీం, చిత్ర నా బృందానికి అభినందనలు" అంటూ మహేష్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇక మహేష్‌ కామెంట్స్‌పై డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. థ్యాంక్యూ సర్‌.. మీ అభినందనలు మా టీం మొత్తానికి చాలా ప్రత్యేకం" అంటూ మహేష్‌కి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మహేష్‌ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. 






కాగా జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ తెలుగు, తమిళ్‌, హిందీ,కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఊహించనట్టుగానే సంచలన విజయం అందుకుంది. అన్ని భాషల్లోనూ ఊహించని రెస్సాన్స్‌తో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలై రెండు వారాలు అవుతున్న వరల్డ్‌ వైడ్‌గా 'కల్కి 2898 ఏడీ' అదే జోరు చూపిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసినట్టు ట్రెడ్‌ వర్గాల నుంచి సమాచారం. ఇక ఓవర్సిస్‌లోనూ కల్కి 2898 ఏడీ రికార్డు వసూళ్లు చేసింది. ఒక్క నార్త్‌ అమెరికాలోనే కల్కి 2898 AD సుమారు 14 మిలియన్‌ డాలర్లు రాబట్టినట్టు సమాచారం. 



Also Read: అఖిల్‌ 'ఏజెంట్'‌ ఓటీటీ కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది‌ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..