Bharateeyudu 2 Also Comes 4DX in Theaters: ఎన్నో వాయిదాల అనంతరం భారతీయుడు 2 విడుదలకు సిద్ధమైంది. కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 12న 'భారతీయుడు 2'(Indian 2) థియేటర్లోకి రాబోతుంది. ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇండియా వైడ్‌గా 'భారతీయుడు 2' ప్రమోషన్స్‌ జోరుగా జరుగుతున్నాయి. ఆదివారం తెలుగులో భారతయుడు 2 ప్రమోషన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నటీనటులు, డైరెక్టర్‌ శంకర్‌లు మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు.


దీంతో భారతీయుడు 2పై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల్లో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా.. ఈ చిత్ర నిర్మాణ సంస్థ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. భారతీయుడు 2ని 4DXగానూ ప్రేక్షకులన తీసుకువస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్‌ తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటన ఇచ్చింది. "ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉండండి! మునుపెన్నడూ లేని విధంగా 4DXలో భారతీయుడు 2(Indian 2) అనుభవం పోందండి! సినిమాని మాత్రమే చూడకండి, ఇందులో జీవించండి" అంటూ మూవీ నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్‌ ట్వీట్‌ చేసింది.


ఇక ఇది ఆడియన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అసలు శంకర్‌ సినిమా పైగా 4DXలో సినిమా అంటే ఇక ఆడియన్స్‌ కన్నుల పండగు అని చెప్పాలి. నిజానికి శంకర్‌ సినిమా అంటే సీన్స్‌, విజువల్స్‌ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే. 80's, 90's లోనే గ్రాఫిక్స్‌తో వెండితెరపై మాయ చేశాడు శంకర్‌. సౌత్‌ సినిమాలకు టెక్నాలజీని పరిచయం చేసిందే శంకర్‌. అలాంటిది ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యధునిక టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్‌ విజువల్స్‌ని భారతీయుడు 2 కోసం ఏ రేంజ్‌లో వాడి ఉంటారో అని ఆడియన్స్‌ అంతా అంచనాల్లో మునిగి తేలుతున్నారు. 






'ఇండియన్‌ 2' సెన్సార్‌ రిపోర్ట్‌ 


1996లో విడుదలయిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ తీసుకువస్తున్నాడు శంకర్‌. అప్పట్లో సంచలన విజయం సాధించిన ఈ సినిమా సీక్వెల్‌ కావడమే 'భారతీయుడు 2'కి ఫస్ట్‌ ప్లస్‌. దాదాపు 28 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్‌ ఇది. ఇక శంకర్‌-కమల్‌ కాంబో, ఇందులోని భారీ తారాగణం మూవీపై ముందు నుంచి విపరీతైమన బజ్‌ క్రియేట్‌ చేసింది. ఇందులో కాజల్‌ అగర్వాల, హీరో సిద్దార్థ్‌, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా,  ఎస్‌జే సూర్య, ప్రియా భవానీ శంకర్‌ వంటి స్టార్స్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని సీబీఎఫ్‌సీ ఆదేశించింది.



ఇందులో భాగంగా 7 ఇంగ్లీష్, తమిళ పదాలను తొలగించమని సెన్సార్‌ బోర్డ్‌ సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాకు మూవీలో ఐదు అత్యవసరమైన మార్పులు చేసినట్టు సమాచారం. స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోమన్నారు. ‘లంచం మార్కెట్’ అనే లేబుల్‌ను తొలగించమని, ఇక ఎక్స్‌పోజింగ్ ఎక్కువగా ఉన్న సీన్‌లో బాడీని కాస్త బ్లర్ చేయమని చెపినట్టుగా టాక్. 


Also Read: భారతీయుడు -2 సినిమా బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి