ప్రభాస్ పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేస్తే చూడాలని ఆయన అభిమానులు చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే... ఆయన అటువంటి సినిమాలో కనిపించి చాలా రోజులు అయ్యింది. ప్రభాస్ లాస్ట్ సినిమా 'రాధే శ్యామ్' ప్యూర్ క్లాసిక్ లవ్ స్టోరీ అయితే... దానికి ముందు చేసిన 'సాహో' స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అందువల్ల, 'మిర్చి' లాంటి మాస్ సబ్జెక్ట్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఎంపిక చేసుకున్న కథల పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా లేరు. దానికి తోడు సినిమా లొకేషన్స్ నుంచి స్టిల్స్ లీక్ కావడం కూడా అభిమానులను కలవరపెట్టింది. కానీ, ఇప్పుడు 'సలార్' లొకేషన్ లో స్టిల్స్ లీక్ అవుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికి కారణం 'కెజియఫ్ 2' సక్సెస్ అని చెప్పాలి.
'కెజియఫ్ 2' దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా 'సలార్'. ఆల్రెడీ 30 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. వచ్చే నెల (మే)లో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. 'కెజియఫ్ 2' కంటే ముందే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో షూటింగ్ లొకేషన్ నుంచి ఫొటోస్ లీక్ అయ్యాయి. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వర్రీ అయ్యారు. లేటెస్టుగా మళ్ళీ లీకుల బెడద మొదలైంది. అయితే, ఇప్పుడు ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. 'కెజియఫ్ 2' విజయం తర్వాత... ప్రభాస్ అభిమానుల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎన్ని స్టిల్స్ లీక్ అయినా ప్రాబ్లమ్ లేదని అనుకుంటున్నారు.
'సలార్'లో ప్రభాస్ రగ్గడ్ లుక్, లొకేషన్స్ చూసిన ఫ్యాన్స్... తమ అభిమాన హీరోను ప్రశాంత్ నీల్ ఏ విధంగా చూపిస్తాడోనని ఊహించుకుంటున్నారు. 'కెజియఫ్ 2' విడుదల తర్వాత 'సలార్' మీద అంచనాలు పెరిగాయన్నది వాస్తవం. వాటిని ప్రశాంత్ నీల్ అందుకోవడం ఖాయమని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.
Also Read: 'కేజీఎఫ్' బ్యూటీ - టాలీవుడ్ ఎంట్రీకి రెడీ
'సలార్'లో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. 'కెజియఫ్ 2'ను నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
Also Read: కీర్తీ సురేష్‌కు లోయర్ బ్యాక్ మజిల్ స్పాజమ్! ఇప్పుడు ఎలా ఉందంటే?