'కేజీఎఫ్' ఛాప్టర్1 సినిమా విడుదలైనప్పుడు హీరోయిన్ శ్రీనిధి శెట్టిపై పెద్దగా ఫోకస్ చేయలేదు జనాలు. సినిమా హిట్ అవ్వడంతో దర్శకనిర్మాతలకు, టెక్నికల్ టీమ్ కి హీరోకి పేరొచ్చిందే తప్ప హీరోయిన్ ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా ఛాప్టర్ 2 విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో శ్రీనిధి శెట్టి పాత్రకు స్క్రీన్ స్పేస్ బాగానే ఇచ్చారు. ఆమె పాత్రకు న్యాయం చేసింది. దీంతో ఇప్పుడు తెలుగు మేకర్ల దృష్టి ఆమెపై పడింది. 


'కేజీఎఫ్' క్రేజ్ ను తమ సినిమా కోసం వాడుకోవాలని చూస్తున్నారు. నిజానికి ఛాప్టర్ 1 హిట్ అయినప్పుడే శ్రీనిధికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఇప్పుడు 'కేజీఎఫ్' ఛాప్టర్ 2 సక్సెస్ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది శ్రీనిధి. ప్రస్తుతానికైతే తన దగ్గరకొచ్చిన ఆఫర్లను పెండింగ్ లో పెట్టింది ఈ బ్యూటీ. 


ప్రస్తుతం ఈమె విక్రమ్ హీరోగా నటిస్తోన్న 'కోబ్రా' అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే చేయాలనుకుంటోంది. కానీ తాజాగా మీడియం రేంజ్ హీరో పక్కన ఆఫర్ రావడంతో ఆలోచనలో పడింది. కాస్త ఆలస్యమవ్వచ్చేమో కానీ శ్రీనిధి టాలీవుడ్ లోకి రావడం మాత్రం పక్కా అని తెలుస్తోంది. ఇదివరకు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలానే ఒక్క హిట్టుతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. మరి శ్రీనిధికి కూడా అలానే ఆఫర్లు వస్తాయేమో చూడాలి!


Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?


Also Read: అమ్మాయిని కాపాడేందుకు అది కోసుకోవడానికి సిద్ధపడిన తండ్రి - 'జ‌యేష్‌భాయ్‌ జోర్దార్'