Prabhas Spirit Movie : రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అందులో ‘సలార్ 2’, ‘కల్కి 2’ కాకుండా ఆ సినిమా సమయంలో ఓకే చెప్పిన ‘స్పిరిట్’ కూడా ఉంది. ‘యానిమల్’తో బాలీవుడ్‌ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు డైరక్షన్ చేయడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఆయన అభిమానులు మాత్రం ఈ ‘స్పిరిట్’ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు చిత్రీకరణ పూర్తవుతుందా? ఎప్పుడు విడుదలకు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో సందీప్ రెడ్డి‌కి క్రియేట్ చేసిన స్టార్‌డమ్ అలాంటిది. సందీప్‌తో మినిమమ్ గ్యారంటీ హిట్ అనే మాటే ఉండదు.. కొడితే బాక్సాఫీస్ కుదేలవాల్సిందే. అందుకే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. 


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి


ఇప్పుడిప్పుడే ‘స్పిరిట్’కు సంబంధించి కదలిక మొదలైంది. మొన్నటి వరకు ‘సలార్’, ‘కల్కి’ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇప్పుడు వాటి సీక్వెల్స్ చిత్రీకరణ‌లో పాల్గొంటున్నాడు. మరో వైపు మారుతితో చేస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే హను రాఘవపూడితో ఓ సినిమా ప్రారంభమైంది కానీ.. షూటింగ్ మొదలవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ‘స్పిరిట్’ సినిమా ‘ఆదిపురుష్’ టైమ్‌లో అనౌన్స్ చేసిన సినిమా. మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చినా.. సందీప్ రెడ్డి మాత్రం వాటిని పట్టించుకోలేదు. తన పనిలో తను ఉన్నాడు. అలాగే ఆయన ఈ మధ్య ఏ ఈవెంట్‌లో కనిపించినా.. ‘స్పిరిట్’కు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది. ప్రజంట్ ‘స్పిరిట్’ స్క్రిప్ట్ లాక్ చేసిన సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా ఈ సినిమా కోసం క్యాస్టింగ్ సెట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.


ఆల్రెడీ కొంతమంది స్టార్స్‌ని ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్లుగా ఇప్పటికే వార్తలు దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో వార్త మీడియా సర్కిల్స్‌లో హైలెట్ అవుతోంది. అదేంటంటే.. ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన ఛార్మింగ్ లేడీ మృణాల్ ఠాకూర్ నటించబోతుందట. ఆల్రెడీ ఆమె‌తో మాట్లాడి ఓకే చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చేశాయి. దీంతో ఈ మెంటలోడి సినిమా క్యాస్టింగ్ చూస్తుంటే నిజంగానే మెంటలెక్కిపోతుంది అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు అలా అనడానికి కారణం లేకపోలేదు. మృణాల్ కంటే ముందు ‘స్పిరిట్’ సినిమా క్యాస్టింగ్ విషయంలో వినిపించిన పేర్లు వారిని అలా అనేలా చేశాయి.


అవును.. ఈ సినిమాలో బాలీవుడ్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌‌లను వంగా ఫైనల్ చేశారని, వారిద్దరూ ఇందులో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారనేలా వార్తలు వినిపించాయి. ఇప్పుడు మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా ఫైనల్ అయినట్లుగా టాక్ నడుస్తుంది. అధికారిక ప్రకటన మాత్రం మేకర్స్ నుండి రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2025 ప్రథమార్థంలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతుందని, 2026 సంక్రాంతికి విడుదల ఉంటుందనేలా మేకర్స్ నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమాను బాలీవుడ్‌కు చెందిన భూషణ్ కుమార్‌తో కలిసి సందీప్ రెడ్డి వంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటనలు రానున్నాయి. 



Also Readనిఖిలే విన్నర్... ట్రోఫీ ఇచ్చిన రామ్ చరణ్, స్టార్స్ సందడి - బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఏంటో చూడండి