Prabhas Thanks to Fans Over Kalki 2898 AD Hit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్సన్‌గా రూపొందిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. వెయ్యి కోట్ల కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ మూవీగా 'కల్కి 2898 AD' నిలిచింది. దీంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతుంది. ఇక తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ సక్సెస్‌పై స్పందించాడు. ఈ మేరకు ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెబుతూ వీడియో సందేశం ఇచ్చాడు ప్రభాస్. తాజాగా ఈ వీడియో వైజయంతీ మూవీస్ నిర్మాణ సంస్థ ట్విటర్‌లో వీడియో షేర్ చేసింది.
మీరు లేకుంటే నేను లేను
"హాయ్. ఎలా ఉన్నారు అందరు. కల్కి 2898 ఏడీ మూవీని ఇంతపెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి చాలా చాలా థ్యాంక్స్. మీరు లేకుంటే నేను లేను. నాగ్ అశ్విన్‌కి కూడా థ్యాంక్స్. ఈ సినిమా కోసం ఐదేళ్లు చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఫైనల్ కల్కి 2898 ఏడీ అద్భుతంగా తీర్చిదిద్ది అందరి ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాను ఎంతో డ్రాండ్ నిర్మించిన నిర్మాత అశ్విన్ దత్‌కు, కో ప్రొడ్యూసర్ స్వప్న దత్‌కు థ్యాంక్స్. మూవీ నిర్మాణంలో ఆమె కీ రోల్ పోషించారు. ప్రతి విషయంలో తన విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపించారు. లెజెండరీ నటులు కమల్ హాసన్ సర్,అమితాబ్ బచ్చన్ సర్‌తో నటంచే అవకాశం ఇచ్చిన అశ్విన్ దత్, నాగ్ అశ్విన్‌కి ధన్యవాదాలను. వాళ్ల సినిమాలు చూస్తు పెరిగిన నాకు వారితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. బ్యూటీఫుల్ దీపికా కూడా థ్యాంక్స్. ఇక కల్కి 2898 ఏడీ సెకండ్ పార్ట్ ఇంకా పెద్దగా ఉండబోతుంది" అంటూ ప్రభాస్ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డార్లింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కల్కి 2898 ఏడీ మొదటి నుంచి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ వెండితెరపై విజువల్ వండర్ క్రియేట చేశాడు. 6000 వేల సంవత్సరం క్రితంకు వెళ్లి నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడంటున్నారు. మొత్తానికి 'కల్కి 2898 ఏడీ'తో ప్రభాస్ అద్భుతం చేశాడని, ఆయన విజనరికి హ్యాట్సాఫ్ అంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీసు వద్ద వసూళ్ల దండయాత్ర చేస్తుంది. మూవీ విడుదలై మూడు వారాలైన ఇప్పటికి అదే జోరు చూపిస్తుంది. ఈ మూవీ రూ.1000 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సినిమా ప్రభాస్ మరోసారి రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రభాస్ ఖాతాలో 'బాహుబలి 2' తర్వాత రూ.1000 కోట్లు సాధించిన రెండో సినిమాగా 'కల్కి 2898 ఏడీ' నిలిచింది.
Also Read: అంబానీ పెళ్లిలో ఆసక్తికర సంఘటన - అమితాబ్ కాళ్లకు నమస్కరించిన రజనీకాంత్, వీడియో వైరల్