Anant Ambani Gifts Watches: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లికి వెళ్లిన క్లోజ్ ఫ్రెండ్స్‌కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. రూ.2 కోట్ల విలువ చేసే వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చాడు అనంత్ అంబానీ. సోషల్ మీడియాలో ఈ గిఫ్ట్‌ల గురించి చాలానే చర్చ జరుగుతోంది. అనంత్ అంబానీ తన ఫ్రెండ్స్ కోసం Audemars Piguet కంపెనీకి చెందిన 25 వాచ్‌లను ఆర్డర్ చేశాడు. తనకు బాగా కావాల్సిన వాళ్లకు వీటిని ఇచ్చాడు. ఈ వాచ్‌లు తీసుకున్న వాళ్లలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జఫ్రీ ఉన్నారు. సోషల్ మీడియా ఈ ఫొటోలూ వైరల్ అవుతున్నాయి. ఈ వాచ్‌లు పెట్టుకుని అందరూ ఫొటోలు దిగారు. Royal Oak Perpetual Calendar Luminary Edition కి చెందిన ఈ గడియారాల్లో రోజ్ గోల్డ్ కలర్ డయల్ ఉంది డయల్స్ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ 25 వాచ్‌ల కోసం అనంత్ అంబానీ రూ.50 కోట్లు ఖర్చు పెట్టారు.
జులై 12వ తేదీన ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్‌కి ప్రముఖులంతా క్యూ కట్టారు. ఇంటర్నేషనల్ బిజినెస్‌మేన్స్‌తో పాటు ప్రపంచ దేశాల కీలక నేతలు, సింగర్స్ వచ్చారు. బాలీవుడ్ ప్రముఖులంతా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె, వరుణ్ ధావన్, రజినీ కాంత్, అనిల్ కపూర్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యా రాయ్ సహా మరి కొందరు ప్రముఖులు హాజరయ్యారు. స్పెషల్ డ్రెసింగ్ స్టైల్‌లో వీళ్లంతా మెరిసిపోయారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మరి కొందరు ఈ వేడుకల్లో స్టెప్పులేశారు. రజినీ కాంత్, యోగా గురు రామ్ దేవ్ బాబా డ్యాన్స్ వేసిన వీడియోలూ నెట్టింట సందడి చేశాయి. ఈ పెళ్లి కోసం ముకేశ్ అంబానీ రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రీవెడ్డింగ్ వేడుకలనూ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఆ వేడుకల్లో అమెరికన్ సింగర్ రియానా ఆటపాటలతో అలరించింది. పెళ్లికి ముందు జస్టిన్ బీబర్ కూడా షో ఇచ్చాడు.
Also Read: Ratna Bhandar Reopens: తెరుచుకున్న రత్న భాండాగారం తలుపులు, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం