Prabhas As Bhairava Look in IPL Video: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. పాన్‌ వరల్డ్‌గా వస్తున్న ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసిగా వస్తున్న ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇటీవల మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ టీం మెల్లిమెల్లిగా అప్‌డేట్స్‌తో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో టీజర్‌ పేరుతో ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా ప్రభాస్‌ భైరవ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భైరవ లుక్‌ను పరిచయం చేస్తూ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు.


ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో యూత్‌ అంతా టీవీలకే అతుక్కుపోతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోకి భైరవను తీసుకొచ్చారు. హిందీ భాషలో ఉన్న ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ముంబై లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోకి సడెన్‌గా ప్రభాస్ భైరవ లుక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. చూడటానికి ఇది ఐపీఎల్‌ యాడ్‌లా ఉన్న ఇందులో ప్రభాస్‌ను 'కల్కి' భైరవగా కొన్ని క్షణాల పాటు చూసి ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. ప్రభాస్‌ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మొత్తానికి కల్కి నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చిందని ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతుంటే. ఓ వర్గం ఫ్యాన్స్‌ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌ అంటే కల్కిలో ప్రభాస్‌ని చూపిస్తారని, యాక్షన్‌తో పవర్ఫుల్‌గా చూపిస్తామనుకున్నామంటున్నారు. 






అమితాబ్‌ బచ్చన్‌ను అశ్వద్ధామాగా పరిచయం చేస్తూ గ్లింప్స్‌ ఇచ్చారు.. అలాగే ప్రభాస్‌ లుక్‌కి సంబంధించి గ్లింప్స్‌ రిలీజ్‌ చేస్తారనుకుంటే ఇలా ఐపీఎల్‌ గ్లింప్స్‌ ఇచ్చారంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఇదంతా చూస్తుంటే ఇది మూవీ టీం మార్కెటింగ్‌ స్ట్రాటజీలా ఉందనుపిస్తోందన్నారు. సినిమాను ఐపీఎల్‌ ద్వారా ప్రమోట్‌ చేయడం చాలా కొత్తగా ఉందని, నాగ్‌ అశ్విన్‌ ప్లాన్‌ భలే ఉందంటున్నాయి సినీవర్గాలు. కాగా కల్కి మూవీని జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇండియన్‌ సినీ చరిత్రలోనే 'కల్కి'ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్ల బడ్జెట్‌ వరకు మూవీని తెరకెక్కిస్తున్న సమాచారం. ఇక మూవీ బడ్జెట్‌లో సుమారు 25 శాతం ప్రభాస్‌ రెమ్యునరేషన్ అన్నట్టుగా ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఈ సినిమాకు ప్రభాస్‌ రూ.150 కోట్లు తీసుకుంటున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 






Also Read: రీరిలీజ్‌కు సిద్ధమైన రానా బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'లీడర్‌'? - ఆ రోజే థియేటర్లో సందడి!