Rana Debut Movie Leader Re Release: రానా దగ్గుబాటి - డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'లీడర్‌'. 15 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఈ సినిమాతోనే రానా హీరోగా పరిచయమయ్యాడు. విడుదలకు ముందు డెబ్యూ చిత్రానికి పొలిటికల్‌ జానర్‌ సెలక్ట్‌ చేసుకున్నాడేంటా? అని అంతా సందేహించారు. కానీ, సీఎం అర్జున్‌ ప్రసాద్‌గా రానా తనదైన నటన, పొలిటికల్‌ లీడర్‌గా ఆకట్టున్నాడు. తనదైన నటనత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి వరకు ఒక యంగ్‌ హీరో పొలిటికల్‌ జానర్‌ టచ్‌ చేయడం అదే ఫస్ట్‌టైం. లీడర్‌ రానా ట్రెండ్‌ సెట్‌ చేశాడు.


2010లో వచ్చిన ఈ సినిమా రానా కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. డెబ్యూ సినిమాతో కమర్షియల్‌ హిట్‌ కోట్టాడు ఈ దగ్గుబాటి వారసుడు. అంతగా ఆకట్టుకున్న ఈ పొలిటికల్‌ డ్రామా ఇప్పుడు మరోసారి థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం దేశమంత ఎన్నికల హడావుడు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హీట్‌ మామూలుగా లేదు. తెలంగాణలో లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మే 9న తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆ రోజే లీడర్‌ రీరిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారట. మే 9న ఈ సినిమా మరోసారి థియేటర్లో సందడి చేయబోతుందంటూ ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 


అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఆ మే 9న ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నారంటూ నెట్టింట గట్టి ప్రచారం జరుగుతుంది.   ఇది తెలిసి ఆడియన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మే 9న థియేటర్లో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు పోలింగ్‌ జరుగుతున్న క్రమంలో ఎన్నికలపై మరింత ఆసక్తి పెంచేలా ఈ పొలిటికల్‌ డ్రామను మళ్లీ థియేటర్లోకి తీసుకురావడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా లీడర్‌లో రానా సరసన రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్‌ ఇద్దరు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుమన్‌ రానాకు తండ్రిగా నటించగా, సుహాసిన తల్లి పాత్రలో ఎమోషన్‌ పండించారు. తనికేళ భరణి, సీనియర్‌ నటులు గోల్లపూడి, సుబ్బారాజు, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, హర్షవర్దన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యూజికల్‌ పరంగా కూడా లీడర్‌ మంచి హిట్‌ అందుకుంది. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతంతో పాటలు బాగా ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అయితే మూవీని నెక్ట్‌ లెవల్‌కు తీసుకువెళ్లిందనడంలో సందేహం లేదు. 






Also Read: 'బర్ఫీ' హిట్‌తో సౌత్‌ ఇండస్ట్రీకి దూరమయ్యా - ఆ దర్శకనిర్మాత వల్లే తెలుగులో ఆఫర్స్‌ రాలేదు