పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొంత విరామం తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే... అది ఆయన సినిమా కాదు. డేరింగ్ అండ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా రూపొందుతున్న 'కన్నప్ప'లో ఆయన ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆ షూట్ అన్నమాట!
నా బ్రదర్ ప్రభాస్ వచ్చాడు!
'కన్నప్ప' (Kannappa) సినిమా చిత్రీకరణలో ప్రభాస్ జాయిన్ అయిన విషయాన్ని గురువారం సాయంత్రం విష్ణు మంచు సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో తెలిపారు. ''నా సోదరుడు ప్రభాస్ షూటింగులో జాయిన్ అయ్యాడు'' అని ట్వీట్ చేశారు.
శివుడి పాత్రలో ప్రభాస్...
ఆ కాలు వెనుక మర్మం ఏమిటి?
Prabhas Role In Kannappa Movie: ప్రభాస్ 'కన్నప్ప' షూటింగ్ చేస్తున్న విషయాన్ని చెప్పిన విష్ణు మంచు... ఓ పోస్టర్ విడుదల చేశారు. అందులో ఒక కాలు తప్ప ఏమీ లేదు. ఆ కాలికి పులి చారలు వంటి దుస్తులు ఉండటం, కాలి వెనుక జడలా జుట్టు కనిపించడంతో శివుడి పాత్రను ప్రభాస్ చేస్తున్నారని నెటిజనులు భావిస్తున్నారు. అయితే, విష్ణు మంచు ఏ విషయం చెప్పలేదు.
Also Read: రామ్ చరణ్ డెనిమ్ షర్టులో ఏమున్నాడ్రా బాబూ - గ్లోబల్ స్టార్ క్యాజువల్ లుక్ కిర్రాక్ అంతే!
'కన్నప్ప' చిత్రీకరణకు ప్రభాస్ ఎక్కువ రోజులు అవసరం లేదు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 'సలార్ 2'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నారట.
'కన్నప్ప' విషయానికి వస్తే... పీరియాడిక్ అండ్ మైథలాజికల్ డ్రామాగా గ్రాండ్ స్కేల్‌లో సినిమా రూపొందుతోంది. ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటీ... అనేది మూవీ కాప్షన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన నటీనటులు ఇందులో కీలకమైన క్యారెక్టర్లు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో, 'ఖిలాడీ' అక్షయ్ కుమార్ ఇటీవల తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు.
Also Read: చిత్రం చూడర మూవీ రివ్యూ: ETV Winలో వరుణ్ సందేశ్ సినిమా - బావుందా? లేదా?
Vishnu Manchu's Kannappa Movie Cast: ప్రభాస్, అక్షయ్ కుమార్ కాకుండా 'కన్నప్ప'లో లేడీ సూపర్ స్టార్ నయనతార, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, లెజెండరీ నటుడు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శరత్ కుమార్, మధుబాల ఇతర ప్రధాన తారాగణం.
'కన్నప్ప' చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు (Mohan Babu) ప్రొడ్యూస్ చేస్తున్నారు. హిందీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. సుమారు 150 కోట్లకు పైగా నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రమిది. పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ రచనలో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీత దర్శకులు.