'సలార్', 'కల్కి 2898 ఏడీ'... రెండు వరుస విజయాలతో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మాంచి జోరు మీద ఉన్నారు. ఈ ఉత్సాహంతో కొత్త సినిమా షూటింగులు చేస్తున్నారు. ఆ సినిమాలకు సీక్వెల్స్ కాకుండా... ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హను రాఘవపూడి సినిమా ఒకటి. ఆ మూవీ అప్డేట్ ఏమిటంటే... 


షూటింగ్ మొదలు పెట్టిన హను రాఘవపూడి!
ప్రభాస్, హను రాఘవపూడి సినిమా ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. అందులో ప్రభాస్ లుక్ గానీ, హీరోయిన్ గురించి గానీ... రెండు మూడు రోజులు డిస్కషన్ బాగా జరిగింది. ఇప్పుడు సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యింది.


ప్రభాస్ సినిమాకు హను రాఘవపూడి ఫిక్స్ చేసిన టైటిల్ ఏమిటి? అనేది ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ, 'ఫౌజీ' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రజెంట్ తమిళనాడులోని కారైకుడిలో జరుగుతోంది. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి... ఆ చిత్రీకరణలో ప్రభాస్ లేరు. ఆయన అవసరం లేని సన్నివేశాలను హను రాఘవపూడి షూటింగ్ చేస్తున్నారు.


Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు - 'దేవర' పగిలిపోయింది



ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాను ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. సినిమా కథ 1940 నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ వారియర్ రోల్ చేస్తున్నారు. 






Prabhas Upcoming Movies: హను రాఘవపూడి సినిమా కాకుండా హను రాఘవపూడి సినిమా కాకుండా మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' చేస్తున్నారు ప్రభాస్. అది వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. అలాగే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చేయనున్నారు.


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు



Prabhas Hanu Raghavapudi Movie Cast And Crew: ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ  నిర్మాణ వ్యయం, ఉన్నత సాంకేతిక విలువలతో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుదీప్ ఛటర్జీ, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: రామకృష్ణ - మోనికా, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ - టి విజయ్ భాస్కర్, వీఎఫ్ఎక్స్: ఆర్‌సి కమల కన్నన్.