దేవర... దేవర... దేవర... ఇప్పుడు దేశవ్యాప్తంగా దేవర ఫీవర్ నడుస్తోంది. సినిమా (Devara Movie) విడుదలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటి? వంటి విషయాలు తెలుసుకోవాలని మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతో పాటు సగటు సినీ అభిమానులు, ప్రేక్షకులు సైతం చాలా ఆసక్తిగా ఉన్నారు. వాళ్లకు ఓ క్రేజీ అప్డేట్!


దేవర... పగిలిపోయింది రా!
'దేవర' గురించి సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతోంది. మూవీ ఎలా ఉంటుంది? ఏమిటి? అని! ఓ నెటిజన్ 'ఏడు రోజుల్లో దేవర' అని ట్వీట్ చేయగా... దానికి మరొకరు 'వస్తున్నాం' అని పేర్కొన్నారు. 'వస్తున్నాం... కొడుతున్నాం' అని ఇంకొకరు ట్వీట్ చేయడంతో పాటు 'దేవర' అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. అందుకు బదులుగా 'డౌట్ ఏ లేదు' అని రిప్లై వచ్చింది. ఇంకొకరు 'సినిమా చూశారా? టాక్ ఏంటి?' అని అడిగారు. అప్పుడు 'దేవర' టీం 'పగిలిపోయింది రా... తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చు' (ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు... సినిమా ష్యూర్ షాట్ హిట్) అని రిప్లై ఇచ్చారు.


Also Read: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే










'దేవర' టీం కాన్ఫిడెన్స్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఏపీ, తెలంగాణ ప్రేక్షకులు అయితే టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌లో మిడ్ నైట్ ఒంటి గంట నుంచి షోస్ వేయనున్నారు.


'దేవర' చూసిన కరణ్ జోహార్... థ్రిల్ అయ్యాడా?
బాలీవుడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం... ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ 'దేవర' సినిమా చూశారట. ఎన్టీఆర్ నటనతో పాటు కథ, ఆ కంటెంట్ చూసి థ్రిల్ అయ్యారట. సినిమా ష్యూర్ షాట్ హిట్ అవుతుందని తన సన్నిహితుల దగ్గర చెప్పారట. దాంతో కంటెంట్ మీద జనాలకు మరింత నమ్మకం పెరిగింది.


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు



ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్... అతిథులు ఎవరెవరు?
'దేవర' విడుదలకు మరో వారం ఉన్న నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 22న) ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున పాన్ చేశారు. హైదరాబాద్ నోవాటెల్ వేదికగా జరిగే ఆ వేడుకలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మాటల మాంత్రికుడు - గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ అటెండ్ అవుతారని సమాచారం. సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.