Prabhas: ఇన్స్టాలో ఆ పోస్టులు చేసేది ప్రభాస్ కాదు... షాకింగ్ న్యూస్ బయట పెట్టిన మలయాళ స్టార్ హీరో
Prabhas : "ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్ స్టాలో ఆ పోస్ట్ లు చేసేది ఆయన కాదు" అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు మలయాళ స్టార్ హీరో.

సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య వారధి లాంటిది సోషల్ మీడియా. డైరెక్ట్ గా కలిసి తమ అభిమాన నటీనటులతో మాట్లాడలేకపోయినప్పటికీ, ఈ సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు చిట్ చాట్, కామెంట్స్, వాళ్లు షేర్ చేసే ఫోటోలు, వీడియోలతో సంతోష పడుతుంటారు అభిమానులు. ఇక ఎప్పుడైనా అభిమానులు చేసే కామెంట్స్ కి సెలబ్రిటీలు రియాక్ట్ అయితే ఆ సంతోషం అంతా ఇంతా కాదు. అలాగే మరో వైపు సెలబ్రిటీలు కూడా తమ ఫాలోవర్స్ కి సినిమాల అప్డేట్లు వంటివి సోషల్ మీడియా ద్వారానే షేర్ చేస్తూ ఉంటారు.
ప్రభాస్ కు భారీ ఫాలోయింగ్
కొంతమంది సెలబ్రిటీలు మాత్రం సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. మరి కొంతమంది అసలు సోషల్ మీడియా అకౌంట్లనే మెయింటైన్ చేయరు. ఇలాంటి వారి లిస్ట్ లో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. ప్రభాస్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయనకు 13 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ మలయాళ స్టార్ హీరో "ప్రభాస్ ఇన్స్టాలో ఆ పోస్టులు చేసేది ఆయన కాదు" అంటూ బాంబ్ పేల్చారు.
ఇన్స్టాలో ఆ పోస్టులు చేసేది ప్రభాస్ కాదా?
ప్రభాస్ అభిమానులకు ఈ బ్యాడ్ న్యూస్ చెప్పిన ఆ మలయాళ స్టార్ హీరో మరెవరో కాదు పృథ్వీరాజ్ సుకుమారన్. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి 'సలార్' మూవీలో నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కాంబో 'సలార్ 2'లో కూడా రిపీట్ కాబోతోంది. ఇప్పటికైతే ఇటు ప్రభాస్, అటు పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తూనే, మరోవైపు దర్శకుడిగా సత్తా చాటుతున్నారు. మార్చ్ 27 న మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'లూసిఫర్ 2 :ఎంపురాన్' రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వం చూసి ఆశ్చర్యపోతూనే, ప్రభాస్ గురించి తనకు తెలిసిన కొన్ని సీక్రెట్స్ ను బయట పెట్టారు.
Also Read: 'తండేల్'తో పోటీ... 25 కుక్కలతో క్లైమాక్స్ షూట్... సాయి రామ్ శంకర్ క్లారిటీ
"ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. అసలు ఆయన తన స్టార్ డమ్ గురించి ఏమాత్రం పట్టించుకోరు. అంతే కాదు సోషల్ మీడియాపై ఆయనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ మాట చెప్పి మిమ్మల్ని అందరిని నిరాశ పరుస్తున్నందుకు క్షమించండి... ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్ స్టాలో నుంచి వచ్చే పోస్టులను షేర్ చేసేది ఆయన కానే కాదు. నిజానికి ప్రభాస్ కు చిన్న చిన్న ఆనందాలు అంటేనే ఇష్టం. ఆయన ఫామ్ హౌస్ లో ఉండడం, మొబైల్ పని చేయని ప్రాంతానికి వెళ్దామని అడగడం లాంటివి చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత పెద్ద స్టార్ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను కోరుకుంటున్నారా అనే ఆలోచన వస్తుంది" అంటూ ఓవైపు పొగుడుతూనే, మరోవైపు ప్రభాస్ సీక్రెట్ ని బయట పెట్టారు పృథ్వీరాజ్ సుకుమారన్.